Sonu sood Sim Card : సిమ్‌‌పై సోనూ బొమ్మ, 10 G నెట్ వర్క్

ట్విట్టర్ వేదికగా somin అనే వ్యక్తి సిమ్ కార్డుపై సోనూసూద్ బొమ్మ పేయింటింగ్ వేసి ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.

Sonu

Sonu Sood Fan : పలు చిత్రాల్లో విలన్ గా నటించి..రియల్ జీవితంలో హీరోగా పేరు సంపాదించిన సోనూసూద్ కు ఎంతో మంది అభిమానులున్నారు. కరోనా కాలంలో ఆయన చేసిన సేవలకు గాను చాలా మంది అభిమానిస్తుంటారు. కొంతమందైతే గుళ్లు కట్టడం కూడా చేశారు. సైకిల్, నడుచుకుంటూ..సోనూ సూద నివాసానికి వెళ్లారు. తాజాగా..ఓ వ్యక్తి సెల్ సిమ్ పై సోనూ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో తెగ వైరల్ గా మారింది.

Read More : Maa Elections : మంచు విష్ణుకు కోట సపోర్ట్.. ప్రకాశ్ రాజ్‌పై తీవ్ర విమర్శలు

ట్విట్టర్ వేదికగా somin అనే వ్యక్తి సిమ్ కార్డుపై సోనూసూద్ బొమ్మ పేయింటింగ్ వేసి ట్విట్టర్ లో పోస్టు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. అందులో సోనూసూద్ కు ట్యాగ్ చేశారు. దీనిని చూసిన..సోనూ  రెస్పాండ్ అయ్యారు. ఉచిత 10 G నెట్ వర్క్ అని సమాధాన ఇచ్చారు. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. 11.8k లైక్స్ వచ్చాయి. కరోనా కాలంలో ఇతను చేసిన సేవలను ఎంతో మంది కొనియాడారు. రియల్ హీరో అంటూ అభివర్ణించారు.

Read More : Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న క్రమంలో..కష్టాలు పడుతున్న వారిని ఆదుకోవడం స్టార్ట్ చేశారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని సొంత గ్రామాలకు ఏకంగా విమానాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలకు ధీటుగా…ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్నాం..హెల్ప్ చేయండి అడగడం తడవు..వెంటనే వారికి సహాయం అందచేస్తున్నారు. సంక్షోభ సమయంలో…ఇతనిపై విశ్వాసం ఉంచారు. దీంతో అతడి సోషల్ మీడియాలో అభ్యర్థనలతో నిండిపోయాయి. తనకు రోజు వారి అందుతున్న మెయిల్ సంఖ్యలను సోనూ సూద ఇటీవలే షేర్ చేశారు. దాదాపు 52 వేల 348 చదవని ఈమెయిల్స్ అని చూపించారు.