Sonu Sood: IAS చదివే వారి కోసం సోనూసూద్‌ సహాయం..

సోనూసూద్‌.. వెండితెర మీద విల్లన్ గా అలరించే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అత్యున్నత చదువులు చదవాలని ఉన్నా చదవలేని ఎంతోమందికి సోనూసూద్ తన ఛారిటీ ద్వారా ఆ కల నిజమయ్యేలా చేస్తున్నాడు. ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ఉచితంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. గతేడాది మొదటిసారిగా...

Sonu Sood: IAS చదివే వారి కోసం సోనూసూద్‌ సహాయం..

Sonu Sood help for IAS Students

Updated On : September 12, 2022 / 4:50 PM IST

Sonu Sood: సోనూసూద్‌.. వెండితెర మీద విల్లన్ గా అలరించే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అరుంధతి సినిమాలో తన విలనిజంతో అందర్నీ భయపెట్టిన సోనూసూద్.. కరోనా టైమ్‌లో భయంతో ఉన్నవారికి తానే ధైర్యం అయ్యాడు. సహాయం అడిగిన వారికి, అడగలేని వారికి చెయ్యి అందిస్తూ.. రియల్‌ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సోనూ సూద్‌.

Sonu Sood: సోనూసూద్‌కి అరుదైన గౌరవం.. యూఏఈ గోల్డెన్ వీసా!

అత్యున్నత చదువులు చదవాలని ఉన్నా చదవలేని ఎంతోమందికి సోనూసూద్ తన ఛారిటీ ద్వారా ఆ కల నిజమయ్యేలా చేస్తున్నాడు. ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం ఉచితంగా కోచింగ్‌ ఇప్పిస్తున్నారు. గతేడాది మొదటిసారిగా ఈ ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన సోనూసూద్‌, ఈ ఏడాది కూడా ఉచితంగా కోచింగ్‌ ఇప్పించబోతున్నట్టు తెలిపారు. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌(ఎస్‌సీఎఫ్‌), డివైన్‌ ఇండియా యూత్‌ అసోసియేషన్‌(డీఐవైఏ)ల సహకారంతో “సంభవం స్కాలర్‌షిప్‌” ని ఆయన ప్రారంభించారు.

ఈ స్కాలర్‌షిప్‌ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు కూడా అవకాశాలు కలిపించడమే. ఈ స్కాలర్‌షిప్‌ ఎంపికైన విద్యార్థులు భారతదేశంలోని టాప్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్స్ నుంచి ఉచిత ఆన్‌ లైన్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ని పొందుతారు. దేశనిర్మాణానికి కొత్త అవకాశాలను ఏర్పర్చుకోవాలనే సోనూసూద్‌ గారి ఆశయం నచ్చి.. ఇలాంటి ఒక కార్యక్రమం వారితో కలిసి పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది అంటూ డిఐవైఏ నిర్వహకులు మనీష్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు.