Wayanad Donations : కేరళ వయనాడ్ విపత్తు.. సెలబ్రిటీల విరాళాల వెల్లువ.. ఎవరు ఎంత ఇచ్చారంటే..?
సౌత్ సినీ పరిశ్రమల నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు.

South Film Celebrities gives Donations to Wayanad
Wayanad Donations : కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి అనేక మంది మృతి చెందారు. ఇప్పటికే 300 పైగా మృతులు లెక్కించగా ఈ సంఖ్య ఇంకా పెరగనుంది. రాష్ట్ర, కేంద్ర బృందాలు రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాయి. ఇక వయనాడ్ బాధితులకు దేశ వ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు పంపిస్తున్నారు.
Also Read : Devara Song : ‘దేవర’ సెకండ్ సాంగ్ మ్యూజిక్ ప్రోమో రిలీజ్.. మెలోడీగా ఎంత బాగుందో..
సౌత్ సినీ పరిశ్రమల నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా వయనాడ్ కోసం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలు అందచేస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ 3 కోట్లు, కమల్ హాసన్ 25 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు, నయనతార – విగ్నేష్ జంట 20 లక్షలు, తెలుగు నిర్మాత నాగవంశీ 5 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి 50 లక్షలు, విక్రమ్ 20 లక్షలు, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాజిల్ , నజ్రియా కలిపి 25 లక్షలు విరాళాలు ఇచ్చారు. ఇంకా పలువురు సినీ నటీనటులు, ప్రముఖులు వయనాడ్ కి విరాళాలు ప్రకటిస్తున్నారు.