బన్నీకి జోడిగా ‘గీతగోవిందం’ బ్యూటీ!

నాగశౌర్య నటించిన ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌కు హలో చెప్పిన కన్నడ అందాల భామ రష్మిక మందన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక విజయ్ దేవరకొండతో నటించిన ‘గీతగోవిందం’ సినిమా ఆమెను స్టార్ హీరోయిన్‌ని చేసేసింది. దీంతో ఆమెతో నటించేందుకు యూత్ హీరోలతో పాటు స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు.
తాజాగా ఈ కన్నడ భామకు ఓ బంపర్ ఆఫర్ తగిలింది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతున్న అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటించనుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ మూవీ వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.