#spbalasubrahmanyam అంత్యక్రియలు..శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

గాన గంధర్వుడు, లెజెండరి సింగర్ బాల సుబ్రమణ్యం మరణించడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాల లోటని, బాలును ఎంతో మందిని తొక్కారంటూ..షాకింగ్ కామెంట్స్ చేశారు సినీ నటి శ్రీరెడ్డి. బాలు పార్థివ దేహానికి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా 10tv తో మాట్లాడారు.
కరోనా వైరస్ కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. ఒక ఉప్పెనాల వచ్చి లక్షలాది మందిని బలి తీసుకుందన్నారు. ఇలాంటి సినీ ప్రపంచాన్ని దిగ్గజలాంటి వ్యక్తులు రాలిపోవడం విషాదకరమని, ఆయన చూపు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కరోనా ఉంటే చనిపోరని, చిన్న ఆరోగ్య సమస్యలుంటే చనిపోతారని వెల్లడించారు. సంగీత ప్రపంచంలో బాలుది ప్రముఖ స్థానమని, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఎంతో మందికి లైఫ్ ఇచ్చారన్నారు.
ఇక బాలుకు కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనా నిబంధనల నేపథ్యంలో తామరైపాక్కంలోని ఫాం హోస్ లో ప్రభుత్వ అధికారలాంఛనాలతో అంతిమ క్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, సన్నిహతులకు మాత్రమే అవకాశం కల్పించారు.
వైదిక శైవ సంప్రదాయం ప్రకారం అంతిమ క్రతువు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు బాలును కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఫాంహౌస్‌కు చేరుకున్నారు.