బాలు పాడిన చివరి కన్నడ పాట విన్నారా! ఇలా పాడడం ఆయనకే సాధ్యం..

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 03:46 PM IST
బాలు పాడిన చివరి కన్నడ పాట విన్నారా! ఇలా పాడడం ఆయనకే సాధ్యం..

Updated On : October 12, 2020 / 3:54 PM IST

SP Balasubrahmanyam: గానగంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రేక్షకాభిమానులను, సాహితీ సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచేసి ఇకశెలవు అంటూ కానరానిలోకాలకు తరలివెళ్లిపోయారు. బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు పాట ఉన్నంతకాలం వినిపిస్తూనే ఉంటారు.. కనిపిస్తూనే ఉంటారు..


బాలు పాడిన చివరి కన్నడ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట, డబ్బింగ్ పరంగా తన గాత్రంతో ఎన్నో ప్రయోగాలు చేసిన బాలు ఈ కన్నడ పాటను తనకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యంతో అద్భుతంగా పాడారు. చిన్న పిల్లాడిలా హావభావాలిస్తూ ఆయన లైవ్‌లో పాడిన చివరి కన్నడ పాటను రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. #SPBlivesOn