LYF Teaser : ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?

తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా LYF సినిమా టీజర్ రిలీజ్ చేసారు.

LYF Teaser : ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. టీజర్ చూశారా?

SPB Charan LYF Love Your Father Teaser Released by Minister Komatireddy Venkata Reddy

Updated On : January 25, 2025 / 3:26 PM IST

LYF Teaser : దివంగత గాయకుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘LYF’ – లవ్ యువర్ ఫాదర్. ఈ సినిమాలో చరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా, ఎస్పీ చరణ్ ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మనీషా ఆర్ట్స్ & మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్ పై కిషోర్ రాటి, మహేష్ రాటి, ఏ రామస్వామి రెడ్డి నిర్మాణంలో పవన్ కేతరాజు దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతుంది.

Also Read : Ram Charan : సుకుమార్ కూతురుతో రామ్ చరణ్.. ఉపాసనతో కలిసి.. ఆ సినిమా కోసం..

ఈ సినిమాలో ప్రవీణ్, భద్రం, నవాబ్ షా, షకలక శంకర్, రవిబాబు, రియా.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు, గతంలో ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేసారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా టీజర్ చూసేయండి..

ఈ టీజర్ చూస్తుంటే.. మంచిగా కనిపిస్తూ మంచి పనులు చేస్తూ ఉండే తండ్రి కొడుకులు రియల్ గా ఏం చేస్తున్నారు, వాళ్ళ అసలు రూపం ఏంటి అంటూ థ్రిల్లింగ్ సబ్జెక్టుగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

SPB Charan LYF Love Your Father Teaser Released by Minister Komatireddy Venkata Reddy

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తీసే సినిమాలు భారీ బడ్జెట్లో కాకుండా మంచి కంటెంట్ తో తక్కువ బడ్జెట్ లోనే తీస్తే సినిమాలు బాగుంటాయి. ఎక్కువ బడ్జెట్ పెట్టి టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం కంటే తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ సినిమాలు తీసుకు రావడం మంచిది. ఈ LYF సినిమా తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను ముందుంటాను. ఓటిటిలో అయినా థియేటర్లో అయినా తక్కువ బడ్జెట్ తో వచ్చే చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తాయి. ఈ సినిమా కూడా అలాగే మంచి హిట్ అవుతుంది అని అన్నారు.

Also Read : Dil Raju: ఐటీ రైడ్ జరుగుతున్నప్పుడు.. మా అమ్మకి ఏమైందంటే..?