Indian Cinema : వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతున్న వరుస సినిమాలు.. సక్సెస్ కు ఇండియన్ సినిమా కొత్త నిర్వచనం..
ఇకపై అన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయా? వెయ్యి కోట్ల కలెక్షన్స్ హీరో మీద, ఇండస్ట్రీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటి?

Indian Cinema : ఇండియన్ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. కలెక్షన్లు.. వందలు కాదు వెయ్యి కోట్లు దాటేస్తున్నాయి. కలెక్షన్లు రాబట్టడం ఇంత ఈజీనా అనిపించింది పుష్ప 2. వెయ్యి కోట్లు ఇప్పుడు కామన్ అయిపోయాయి. సక్సెస్ కు మన సినిమాలు కొత్త నిర్వచనం ఇస్తున్నాయా? హిట్ కు వెయ్యి కోట్లు అనేది బెంచ్ మార్క్ గా మారిపోయిందా? ఈ కలెక్షన్ ఇండియన్ సినిమా జర్నీని మార్చడం ఖాయమా?
ఇండియన్ సినిమాలో ఇప్పుడు కనిపిస్తున్న మార్పు.. చరిత్ర గుర్తుంచుకుంటుంది గ్యారెంటీగా. పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ అయ్యాక బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ అవుతున్నాయి. మూవీ మేకింగ్ దగ్గరి నుంచి కలెక్షన్ల వరకు అన్నీ కొత్తగా, అంతా కొత్తగా అన్నట్లు కనిపిస్తోంది సీన్. వెయ్యి కోట్ల కలెక్షన్లు కామన్ అయిపోయాయి. ఆ రేంజ్ వసూళ్లు అంటే అసలు సాధ్యమేనా అనుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు మన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నాయి.
పాత రికార్డులను బ్రేక్ చేయడమే కాదు బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తున్నాయి. పుష్ప 2తో అది మళ్లీ ప్రూవ్ అయ్యింది. వారం రోజుల్లో ఈజీగా వెయ్యి కోట్లు దాటేసింది పుష్ప 2. దీంతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకు వస్తోంది. ఒకప్పుడు 100 కోట్లు కొడితే బ్లాక్ బస్టర్ అనే వారు. అలాంటిదిప్పుడు వెయ్యి కోట్లు అనేది హిట్ సినిమాకు బెంచ్ మార్క్ గా మారిందా అనే చర్చ మొదలైంది.
అదేదో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్లు జాగ్రత్తగా వెయ్యి కోట్లు కొట్టి చూపించాడు పుష్ప. రిలీజ్ నుంచి డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, టికెటింగ్ వరకు పక్కా స్ట్రాటజీతో వెయ్యి కోట్లు కొట్టి చూపించాడు. ఇకపై అన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతాయా? వెయ్యి కోట్ల కలెక్షన్స్ హీరో మీద, ఇండస్ట్రీ మీద చూపించే ఎఫెక్ట్ ఏంటి? టాలీవుడ్ నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లో ఇకపై చేరే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటి?
Also Read : సినిమా వాళ్లపై సీఎం ఫైర్.. అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?