Bigg Boss 5 : బిగ్ బాస్ విజేతకు అదిరిపోయే ఆఫర్.. ప్రైజ్‌మనీ‌తో పాటు ఇల్లు కట్టుకోడానికి స్థలం కూడా..

గతంలో బిగ్ బాస్ షో విజేతలకు 50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. తాజాగా ఈ సీజన్ విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ‌తో పాటు మరో అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చారు......

Bigg Boss 5 : బిగ్ బాస్ విజేతకు అదిరిపోయే ఆఫర్.. ప్రైజ్‌మనీ‌తో పాటు ఇల్లు కట్టుకోడానికి స్థలం కూడా..

Biggboss Prizemoney

Updated On : November 29, 2021 / 9:30 AM IST

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో పోటీ చేసే కంటెస్టెంట్స్ కి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారు. ఇది కాకుండా ఫైనల్ వరకు వచ్చి ఫైనల్ లో గెలిచిన విజేతకు ప్రైజ్‌మనీ‌ కూడా ఉంటుంది. గతంలో బిగ్ బాస్ షో విజేతలకు 50 లక్షల ప్రైజ్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. తాజాగా ఈ సీజన్ విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ‌తో పాటు మరో అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఆఫర్ ని నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ తో చెప్పాడు.

Bigg Boss 5 : 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారు? కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ప్రశ్న.. ఎవరెవరు ఏం చెప్పారో చూడండి..

ఈ సీజన్లో విజేతకు 50 లక్షలతో పాటు అదనంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కూడా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నాగార్జున నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో అధికారికంగా ప్రకటించాడు. బిగ్‌బాస్‌ విన్నర్‌ రూ.50 లక్షలతో పాటు, షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువైన 300 చదరపు గజాల స్థలాన్నికూడా గెలుచుకుంటారు అని తెలిపాడు. అయితే ఇది ఆ సంస్థ తమ ప్రమోషన్ కోసం ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ సారి విజేత పంట పండినట్లే అని భావిస్తున్నారు.