Devara : యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘దేవర’ నుంచి ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ – ది ఫేసెస్ ఆఫ్ ఫియర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.

Special poster release from Jr Ntr Devara Movie
Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ‘ది ఫేసెస్ ఆఫ్ ఫియర్’ అని దానికి క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.
ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయంలో కనిపించనున్నాడా అనే కామెంట్లు చేస్తున్నారు. సినిమా విడుదల అయిన తరువాతనే దీనిపై స్పష్టత రానుంది.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, శృతి మరాథే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయారాసన్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. రెండు లిరికల్ సాంగ్స్ సైతం రికార్డు వ్యూస్ సాధించాయి.
Devara : ‘దేవర’ బుకింగ్స్ ఓపెన్..! బెనిఫిట్ షోస్ టైం ఫిక్స్..?
??? ????? ?? ???? ‼️
In a month, his arrival will stir up the world with an unmissable big screen experience ??
Let’s experience his Majestic Madness in theaters on September 27th ❤️?#Devara #DevaraOnSep27th pic.twitter.com/IJtvGRCwaa
— Devara (@DevaraMovie) August 27, 2024