Sree Vishnu: సామజవరగమన.. అంటూ ఫస్ట్ గ్లింప్స్ పట్టుకొస్తున్న శ్రీవిష్ణు!

యంగ్ హీరో శ్రీవిష్ణు నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో నటించే సినిమాల్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఆయన సినిమాలు చూసేందుకు క్యూ కడుతుంటారు. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ‘వివాహ భోజనంబు’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sree Vishnu: సామజవరగమన.. అంటూ ఫస్ట్ గ్లింప్స్ పట్టుకొస్తున్న శ్రీవిష్ణు!

Sree Vishnu Samajavaragamana Movie First Gilmpse Out Tomorrow

Updated On : February 27, 2023 / 5:20 PM IST

Sree Vishnu: యంగ్ హీరో శ్రీవిష్ణు నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో నటించే సినిమాల్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఆయన సినిమాలు చూసేందుకు క్యూ కడుతుంటారు. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ‘వివాహ భోజనంబు’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కంటెంట్‌తో వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sree Vishnu: ప్రేమికుల రోజున శ్రీవిష్ణు నెక్ట్స్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్!

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ తెలిపింది. సామజవరగమన మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను ఫిబ్రవరి 28న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Sree Vishnu: మరో సినిమాను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు.. తగ్గేదే లే అంటున్నాడుగా!

విజిల్ మూవీ ఫేం రెబా మోనికా జాన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా, వెన్నెల కిషోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండ ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.