Sreeleela : వీణ వాయించిన శ్రీలీల.. ఏకంగా బంగారు చైన్ గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య.. శ్రీలీలకు ఎన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో..

శ్రీలీల తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చింది.

Sreeleela Played Veena in Balakrishna Unstoppable Show Balayya Gifted Gold Chain

Sreeleela : వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల తాజాగా పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో అలరించి అదరగొట్టేసింది. ఓ పక్క చదువు, మరో పక్క సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చింది. ఇటీవలే అన్‌స్టాపబుల్ సీజన్ 4 నుంచి ఆరో ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ లో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి వచ్చి సందడి చేసి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

అయితే ఈ ఎపిసోడ్ లోకి శ్రీలీల వీణ వాయిస్తూ ఎంట్రీ ఇచ్చింది. ఒక మెలోడీ మ్యూజిక్ ని వాయించింది శ్రీలీల. శ్రీలీల ట్యాలెంట్ చేసి బాలయ్య అభినందించాడు. ఇంత బాగా వీణ వాయించినందుకు బాలయ్య శ్రీలీలకు ఓ గోల్డ్ చైన్ ని కూడా బహూకరించాడు. ఇదే ఎపిసోడ్ లో శ్రీలీల తన ట్యాలెంట్స్ గురించి చెప్పింది.

Also Read : Allu Arjun : ‘బన్నీ రికార్స్ మోత’.. పుష్ప 50 రోజుల కలెక్షన్, పుష్ప 2కి కేవలం రెండు రోజుల్లోనే..

శ్రీలీలకు వీణ వాయించడంతో పాటు భరతనాట్యం కూడా వచ్చని తెలిపింది. శ్రీలీల మంచి డ్యాన్సర్ అని తెలిసిందే. చిన్నప్పుడు నుంచి డ్యాన్స్ నేర్చుకుంది. అలాగే స్విమ్మింగ్ పోటీల్లో కూడా చిన్నప్పుడు పతకాలు సాధించింది శ్రీలీల. అలాగే యాక్టింగ్ తో సినిమాల్లో దూసుకుపోతుంది. మరో వైపు డాక్టర్ చదువుతుంది. ప్రస్తుతం తన MBBS ఫైనల్ స్టేజి లో ఉందని తెలిపింది. శ్రీలీల పాటలు కూడా పాడుతుందని తెలిపింది. చిన్నప్పట్నుంచి వాళ్ళ అమ్మ అన్నిట్లో శిక్షణ ఇచ్చిందని తెలిపింది. దీంతో శ్రీలీలలో చాలా ట్యాలెంట్స్ ఉన్నాయని ఆశ్చర్యపోతున్నారు. ఇక శ్రీలీల – బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.