Sreemukhi : నేను కూడా హిందువునే.. పొరపాటు జరిగింది.. క్షమించండి.. శ్రీముఖి వీడియో వైరల్..

యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా హోస్ట్ చేసింది.

Sreemukhi Said Sorry Regarding Sankranthiki Vasthunnam Trailer Launch Event Issue

Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఇటీవల నిజామాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి యాంకర్ గా హోస్ట్ చేసింది. ఈ ఈవెంట్లో శ్రీముఖి.. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ల గురించి చెప్తూ రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అప్పట్లోనే మనం విన్నాము. సాక్షాత్తు ఇప్పుడు దిల్ రాజు, శిరీష్ లాగా మన కళ్ళముందే కూర్చున్నారు అని చెప్పింది.

Also Read : Racharikam Trailer : ఆర్జీవీ భామ అప్సరా రాణి ‘రాచరికం’ ట్రైలర్ రిలీజ్.. అరాచకంగా ఉందిగా..

అయితే రామలక్ష్మణులుగా అన్నదమ్ములను పోలిస్తే తప్పు లేదు కానీ రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్ అని అనడంతో పలు హిందూ సంఘాలు, నెటిజన్లు శ్రీముఖి పై తీవ్ర విమర్శలు చేసారు. ఇవాళ ఉదయం నుంచి శ్రీముఖి పై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో శ్రీముఖి దీనిపై స్పందిస్తూ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

శ్రీముఖి ఈ వీడియోలో మాట్లాడుతూ.. రీసెంట్ టైంలో నేను హోస్ట్ చేసిన ఓ సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణులను ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అన్నాను. నేను ఒక హిందువునే. నేను దైవ భక్తురాలినే. రాముడిని అమితంగా నమ్ముతాను. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా వీలైనంత జాగ్రత్తపడతాను అని మీ అందరికి మాటిస్తు మీ అందరికి క్షమాపణ కోరుతున్నాను. పెద్దమనుసుతో మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. జై శ్రీరామ్ అని చెప్పింది. దీంతో శ్రీముఖి వీడియో వైరల్ గా మారింది.

ఇక శ్రీముఖి పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లు చేస్తూ సినిమాలలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంది.

Also See : Rana Wife Miheeka : రానా భార్య మిహీక కొత్త బిజినెస్.. ఓపెన్ చేసిన రాజమౌళి.. ఫోటోలు చూశారా?