English Vinglish : శ్రీదేవి మళ్ళీ వస్తుంది.. అతిలోక సుందరి సినిమా చైనాలో రిలీజ్..
శ్రీదేవి 2018 లో హఠాత్తుగా అనుమానాస్పదరీతిలో మరణించింది. ఆమె మరణం అభిమానులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత శ్రీదేవిని తెరపైన చూపించనున్నారు. అయితే...........

Sridevi English Vinglish Movie releasing in China after 11 years
English Vinglish : అతిలోక సుందరి శ్రీదేవి ఇండియా అంతటా అనేక భాషల్లో సినిమాలు తీసి ప్రేక్షకులని మెప్పించి కోట్లలో అభిమానులని మూటకట్టుకున్నారు. బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరమయ్యారు శ్రీదేవి. హీరోయిన్ గా 1997 లో చివరి సినిమా తీయగా ఆ తర్వాత ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇక 2012 లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ వింగ్లిష్ అనే సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు శ్రీదేవి.
శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా ఇండియాతో పాటు విదేశాల్లో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చారు. కేవలం 10 కోట్ల బడ్జెట్ తో హిందీ, తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 102 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఇంగ్లీష్ వింగ్లిష్ తర్వాత శ్రీదేవి రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ చేసింది. మామ్ అనే సినిమా చివరి సినిమాగా మిగిలింది శ్రీదేవికి.
Michael : మైఖేల్.. సందీప్ కిషన్ కెరీర్ బెస్ట్ కల్క్షన్స్.. 3 రోజుల కలెక్షన్స్ ఇవే..
శ్రీదేవి 2018 లో హఠాత్తుగా అనుమానాస్పదరీతిలో మరణించింది. ఆమె మరణం అభిమానులకు, సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత శ్రీదేవిని తెరపైన చూపించనున్నారు. అయితే అది ఇక్కడ కాదు చైనాలో. శ్రీదేవి గ్రాండ్ కంబ్యాక్ సినిమా ఇంగ్లీష్ వింగ్లిష్ ని దాదాపు 11 ఏళ్ళ తర్వాత 2023 ఫిబ్రవరి 24న చైనాలో అధికారికంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు పోస్టర్స్ వేసి ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీంతో ఇండియాలో కూడా రీరిలీజ్ చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
‘ENGLISH VINGLISH’ TO RELEASE IN CHINA… #EnglishVinglish [2012] – which marked #Sridevi's return to the big screen after a 15-year hiatus – to release in #China on 24 Feb 2023… OFFICIAL POSTERS… pic.twitter.com/7ycgVtoeZC
— taran adarsh (@taran_adarsh) February 6, 2023