చైనాలో సత్తా చాటుతున్న శ్రీదేవి ‘మామ్’ మూవీ
ముందు ముందు చైనాలో మామ్ మరింత భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందటున్నారు ట్రేడ్ పండితులు..

ముందు ముందు చైనాలో మామ్ మరింత భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందటున్నారు ట్రేడ్ పండితులు..
శ్రీదేవి నటించిన చివరి సినిమా, మామ్.. చైనా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు కొనసాగిస్తుంది. శ్రీదేవి, నవాజుద్దీన్ సిద్దిఖీ, అక్షయ్ ఖన్నా తదితరులు నటించిన మామ్, 2017 జూలై 7న విడుదలై విజయం సాధించింది. తన కూతురి కోసం న్యాయపోరాటం చేసే తల్లిగా శ్రీదేవి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. 2019 మే 10న మామ్, చైనాలో రిలీజ్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఊహించని వసూళ్ళు రాబట్టింది.
ఫస్ట్ డే రూ.9.93 కోట్లు, సెకండ్ డే రూ.15.36 కోట్లు, థర్డ్ డే రూ.14.16 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వీకెండ్‌లో రూ.41.34 కోట్లు కొల్లగొట్టిన మామ్, ప్రివ్యూ ద్వారా రూ.1.5 కోట్లు వసూలు చెయ్యడం విశేషం.. బాలీవుడ్‌లో రూ.37 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మామ్, బాక్సాఫీస్ దగ్గర రూ.107 కోట్లు వసూలు చేసింది. ముందు ముందు చైనాలో మామ్ మరింత భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందటున్నారు ట్రేడ్ పండితులు.