Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

సూపర్‌స్టార్ మహేష్ బాబుతో - శ్రీకాంత్ తనయుడు రోషన్ చిన్నప్పటి పిక్ వైరల్ అవుతోంది..

Srikanth Son Roshan : మహేష్ మాత్రం ఏం మారలేదు

Mahesh Roshan

Updated On : October 12, 2021 / 2:54 PM IST

Srikanth Son Roshan: టాలీవుడ్‌లో ‘కింగ్’ నాగార్జున, సూపర్‌స్టార్ మహేష్ బాబుల ఫిట్‌నెస్ చూస్తే సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ అవ్వాల్సిందే. నాగ్ 60 ప్లస్‌లో, మహేష్ 40 ప్లస్ అయినా యంగ్ అండ్ ఎవర్‌గ్రీన్‌గా కనిపిస్తుంటారు. ‘అన్నం తింటున్నారా.. అందం తింటున్నారా’ అన్నంత స్లిమ్‌గా తయారవుతున్నారు.

Mahesh Koneru : మహేష్ కోనేరు ఇకలేరు

రీసెంట్‌గా నెట్టింట ఓ రేర్ పిక్ వైరల్ అవుతుంది. సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందD’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సూపర్‌స్టార్‌ని కలిశారు. మహేష్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి, టీంకి విషెస్ చెప్పారు.

Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..

ఈ సందర్భంగా మహేష్, రోషన్ కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రోషన్ చిన్నతనంలో మహేష్‌తో తీసుకున్న ఫొటో, ఇప్పటి ఫొటో పక్కపక్కన పెట్టి.. రోషన్ పెరిగి పెద్దవాడయ్యాడు.. హీరోగా సినిమాలు చేస్తున్నాడు కానీ మహేష్ బాబు మాత్రం ఏం మారలేదు.. అలాగే ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Mahesh Babu : పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్.. స్విమ్మింగ్‌ పూల్‌లో సితారతో మహేష్