Evaru Meelo Koteeswarulu : ఇక్కడ నేనే బాస్.. రాజమౌళి, కొరటాలతో ఎన్టీఆర్ గేమ్ షో..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటిశ్వరుడు షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Jr Ntr Hosted Evaru Meelo Koteeswarulu Soon
Evaru Meelo Koteeswarulu : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటిశ్వరుడు షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఎన్టీఆర్ తనదైన శైలిలో టీవీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాప్ సెలబ్రిటీలతో కూడా గేమ షో చేస్తూ ఫుల్ ఎంటర్ టైన్ అందిస్తున్నారు. గేమ్ షో తొలి ఎపిసోడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో మొదలుపెట్టాడు ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ మూవీలో మాదిరిగా గేమ్ షోలోనూ ఇద్దరూ కనిపించడంతో అభిమానులంతా ఫుల్ ఖుష్ అయ్యారు. బిగ్ బాస్ మొదటి సీజన్ చేసి తెలుగు ప్రేక్షకులకు రియాల్టీ షో రుచి చూపించిన ఎన్టీఆర్.. మీలో కోటీశ్వరుడు గేమ్ షోనూ కూడా అదే స్థాయిలో ముందుకు నడిపిస్తున్నాడు.
Hyderabad : ఇన్‌స్టాగ్రాంలో గంజాయి అమ్మకం
సెప్టెంబర్ 20న ప్రారంభమయ్యే మరో ఎపిసోడ్ లో ఈసారి ఎన్టీఆర్ దిగ్గజ దర్శకులైన ఎస్.ఎస్ రాజమౌళి, కొరటాల శివను గేమ్ షోకు తీసుకొస్తున్నాడు. ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌లో వీరిద్దరూ కూర్చొని గేమ్ షో ఆడబోతున్నారు. దీనికి సంబంధించి ప్రొమోను కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో ఎన్టీఆర్.. రాజమౌళి, కొరటాలను వేదికపై ఆహ్వానించగా.. వారిద్దరూ సీటులో కూర్చొగానే.. రోల్ కెమెరా.. యాక్షన్ అని అన్నారు. అంతే.. షాకైన ఎన్టీఆర్.. వెంటనే.. ఆగండి.. ఈ లొకేషన్ నాది.. ఇక్కడ నేనే బాస్ అంటూ ఎన్టీఆర్ పంచ్ డైలాగులు పేల్చారు. ఇప్పుడీ ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
Can’t Wait ??
Next Week @tarak9999 ?#EvaruMeeloKoteeswarulu#ManOfMassesNTR pic.twitter.com/SMuIn0uAGY
— Troll NTR Haters (@TrollNTRHaterz) September 16, 2021
సెప్టెంబర్ 20న ఈ ఎపిసోడ్ టెలిక్యాస్ట్ కానుంది. దర్శకదీరులు రాజమౌళి, కొరటాలతో గేమ్ షో టీఆర్పీని బాగా తీసుకొస్తుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరూ దర్శకులతో ఎన్టీఆర్‌కు మధ్య మంచి బాండింగ్ ఉంది. జక్కన్న రాజమౌళితో స్టూడెంట్ నెం 1 మూవీలో నటించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ చిత్రాల్లో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో రెడీగా ఉన్నాడు. ఇక కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ చేసిన జనతా గ్యారేజ్ మూవీ బంపర్ హిట్ అయింది. కొరటాల దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ 30వ మూవీ చేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది.
Tollywood Drug Case : ఈడీ ఎదుట హీరో తనీష్, డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్నారా ?