Hyderabad : ఇన్‌స్టాగ్రాంలో గంజాయి అమ్మకం

గంజాయి ముఠాలు కొత్త ట్రెండ్స్‌ సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా గంజాయి అమ్మకలకు పాల్పడుతున్నాయి.

Hyderabad : ఇన్‌స్టాగ్రాంలో గంజాయి అమ్మకం

Hyderabad (3)

Hyderabad : గంజాయి అక్రమ వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతోంది. గతంలో హైదరాబాద్ నగరంలో ఏదోఒక ప్రాంతంలో గంజాయి దొరికేది. కానీ ఇప్పుడు నగరం మొత్తం ఎక్కడపడితే అక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా సోషల్ మీడియా ద్వారా గంజాయి అమ్మకాలు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలిసిన మధ్యవర్తుల ద్వారా గుట్టుగా గంజాయి సరఫరా చేసిన గ్యాంగులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే దుకాణాలు తెరుస్తున్నాయి.ఇన్‌స్ట్రాగ్రాం గ్రూపుల ద్వారా వలవేసి, ఫైన్‌ క్వాలిటీ పొడి గంజాయిని అందిస్తున్నాయి.

Read More : DVAC Raids : మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు, విదేశీ కరెన్సీ, 4.9 కిలోల బంగారం స్వాధీనం!

ఇక తాజాగా కొత్త ట్రెండ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది కొందరు వ్యక్తులు గంజాయి కేఫ్ లు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా నగరంలో అత్యంత రద్దీగా ఉండే అమీర్‌పేట ఏరియాలో కావడం గమనార్హం. గంజాయి మత్తులో జోగుతున్నవారిలో ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, పలువురు ధనవంతుల పిల్లలు ఉన్నట్టు సమాచారం.

ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎక్సైజ్‌ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇన్‌స్పెక్టర్‌ బీ ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో ఈ నెల 14న అమీర్‌పేట, లా కాలేజీ రోడ్డు, ఎల్లారెడ్డిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడులు నిర్వహించింది. అక్కడ ఓ గంజాయి కేఫ్ నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో గంజాయి సరఫరా చేస్తున్న జీ వరుణ్‌చందర్‌, జీ చంద్రశేఖర్‌, వీ కృష్ణప్రసాద్‌, వై రమేశ్‌లను అరెస్టు చేశారు.

Read More : Petrol And Diesel Price : పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు

ఇక వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందని ఆరాతీయడంతో ఆదిత్య పేరు బయటకు వచ్చింది. ఆదిత్య అనే వ్యక్తి నగరంలో అనేక చోట్ల గంజాయి సప్లయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. గంజాయి పంటకు ఫేమస్ అయిన విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి దీనిని హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక్కో పొట్లం రూ.వెయ్యికి కస్టమర్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కాలేజీ పిల్లలు, ఆర్ధికంగా ఉన్నవారిని టార్గెట్ చేసి ఈ పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.