SS Rajamouli post viral after Sri Simha Wedding
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ ఓ ఇంటివాడు అయ్యాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. వీరిది డెస్టినేషన్ వెడ్డింగ్ కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని Ras Al Khaimahలో డిసెంబర్ 14న రాత్రి పెళ్లివేడుక గ్రాండ్‌గా జరిగింది. అన్న కుమారుడి వివాహానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన భార్య రమాతో కలిసి హాజరు అయ్యారు.
వివాహా వేడుక ముగియడంతో సోషల్ మీడియా వేదికగా రాజమౌళి ఓ పోస్ట్‌ను పంచుకున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహా వేడుకలు జరిపించిన ప్రతి ఒక్కరికి రాజమౌళి ధన్యవాదాలు తెలియజేశారు.
Pushpa 2 : 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్ర తిరగరాసిన ‘పుష్ప 2’..
‘గత 10 రోజులు సింహా-రాగ వివాహ సమయంలో చాలా అందమైన క్షణాలతో నిండిపోయింది. కుటుంబంలోని మనందరికీ దీన్ని నిజంగా గుర్తుండిపోయేలా చేసిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అంటూ ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎవరు ఏ విధంగా సాయం చేశారో వెల్లడించారు రాజమౌళి.
శ్రీసింహ విషయానికి వస్తే.. రాజమౌళి తీసిన పలు చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. విక్రమార్కుడు, యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో మెరిశాడు శ్రీ సింహా. ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర చిత్రాల్లో హీరోగా నటించాడు. ‘మత్తు వదలరా పార్ట్ 1, పార్ట్ 2తో సాలీడ్ హిట్స్ అందుకున్నాడు.
Soniya Akula : పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ సోనియా.. కనిపించని పెద్దోడు, చిన్నోడు..!