Rajamouli to meet Pawankalyan: పవన్‌ను కలవనున్న రాజమౌళి.. నిజమేనా? రీజన్ ఇదేనా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను.. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రత్యేకంగా.. పర్సనల్ గా కలవనున్నారా? తన సినిమా RRR విషయంలో.. పవన్ తో చర్చించనున్నారా?

Rajamouli Pawankalyan
Rajamouli to meet Pawankalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను.. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి.. ప్రత్యేకంగా.. పర్సనల్ గా కలవనున్నారా? తన సినిమా RRR విషయంలో.. పవన్ తో చర్చించనున్నారా? పవన్ లేటెస్ట్ ఫ్లిక్ భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా కోరనున్నారా? సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ఆధారంగా.. ఇది నిజమే అని తెలుస్తోంది.
RRR.. భారీ బడ్జెట్ సినిమా. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి షూట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి టాప్ క్లాస్ టాలీవుడ్ స్టార్లే కాదు.. బాలీవుడ్, హాలీవుడ్ నటులు కూడా ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా బిజినెస్ జరుగుతోంది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేదిగా ఇప్పటికే అంచనాలు ఊహలకందని స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో.. పవన్ కల్యాణ్ ఇచ్చిన షాక్.. RRR టీమ్ ను కంగారు పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. సంక్రాంతికి రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసిన జక్కన్నకు.. పవన్ కల్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కూడా అప్పుడే రిలీజ్ కావడం ఖాయమన్న న్యూస్.. మింగుడుపడకుండా చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. జనవరి 7న సంక్రాంతి కానుకగా RRR ను రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత.. కేవలం 5 రోజుల గ్యాప్ లో పవన్ లాంటి పవర్ ఫుల్ మాస్ స్టార్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ ఖాయమన్న న్యూస్ తో.. రాజమౌళి సినిమా కలెక్షన్లపై ప్రభావం ఖాయమన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే.. ఆలస్యం చేయకుండా.. తన సినిమాకు ఎలాంటి డ్యామేజ్ కలగకుండా.. రాజమౌళే.. నేరుగా రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా విడుదల తేదీని ఇంకొన్ని రోజులు ముందుకు జరపాలని స్వయంగా పవన్ కల్యాణ్ ను కోరనున్నట్టు సమాచారం అందుతోంది. అవసరమైతే.. పవన్ కు ఆయన సన్నిహితుడు త్రివిక్రమ్ తో కూడా చెప్పించాలని ట్రై చేస్తున్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. RRR నిర్మాత డీవీవీ దానయ్య, డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి త్రివిక్రమ్ ను కలిసే అవకాశం ఉన్నట్టు కూడా టాక్ నడుస్తోంది.
ఎలాగైనా సరే.. తన సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేసి గ్రాండ్ హిట్ కొట్టాలని జక్కన్న కసిగా ఉన్నట్టు తాజా పరిణామంతో స్పష్టమవుతోంది. మరి.. గుసగుసలు చెబుతున్నట్టు రాజమౌళి వెళ్లి పవన్ ను కలుస్తారా.. సంక్రాంతికే తన సినిమాను రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్న పవన్ కల్యాణ్.. ఈ విషయంలో స్పందిస్తారా.. నిర్ణయాన్ని మార్చుకుంటారా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు.. తన అబ్బాయ్ చెర్రీ కూడా కీ రోల్ ప్లే చేస్తున్న RRR కోసం భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ను మార్చుకుంటారా.. ఏం జరగబోతోంది.. వచ్చే సంక్రాంతికి ముందుగా ఏ సినిమా రాబోతోంది.. అదే సీజన్ కు రెడీ అవుతున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఫ్యూచర్ ఏంటి.. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే.. ఈ గుసగుసలపై అధికారిక ప్రకటన రావాల్సిందే.