తమిళ్ అర్జున్ రెడ్డిలో.. ధృవ్‌కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!

టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను కోలీవుడ్‌లో ధృవ్ విక్రమ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసి ఫిదా అయిన విక్రమ్ తన కొడుకు ధృవ్‌ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయడానికి ఈ సినిమాను ఎంచుకున్నాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రీమేక్ నిర్మాతలకు నచ్చకపోవటంతో పూర్తి సినిమాను గిరీశయ్య దర్శకత్వంలో మరోసారి తెరకెక్కిస్తున్నారు. కొత్తగా తెరకెక్కిస్తున్న ఈ రీమేక్‌లో నటీనటులను కూడా మార్చేశారు చిత్రయూనిట్.
Read Also : ‘సూర్యకాంతం’ మూవీ ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధిగా దేవరకొండ..
గిరిసాయి దర్శకత్వంలే తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి బనిత సంధుని హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోగా నటిస్తున్న ధృవ్‌కి తండ్రిగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారట. ఇప్పటి వరకు గెస్ట్ రోల్స్‌లో మాత్రమే కనిపించిన గౌతమ్, అర్జున్ రెడ్డి రీమేక్‌లో మాత్రం ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2020లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం.
Read Also : రాజమండ్రిలో దీపిక ఓటుకు.. కాజల్ ఫొటో