Intinti Ramayanam : స్టార్‌మా లో సరికొత్త సీరియల్.. ‘ఇంటింటి రామాయణం..’ ఉమ్మడి కుటుంబంలో 20 మంది..
స్టార్ మాలో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఇంటింటి రామాయణం పేరుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది.

Star Maa New serial Intinti Ramayanam
Star Maa – Intinti Ramayanam : స్టార్ మాలో సరికొత్త సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఇంటింటి రామాయణం పేరుతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమైంది. ఒకప్పుడు ప్రతి తెలుగు లోగిలిలో వైభవంగా వెలిగిన ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్‌తో ఈ సీరియల్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం కుటుంబం అంటే ముగ్గురు లేదా నలుగురికే మాత్రం పరిమితమైంది. అలాంటిది ఈ కాలంలో దాదాపు 20 మంది ఉన్న ఉమ్మడి కుటుంబం ఉంటే.
ఉమ్మడి కుటుంబంలో మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, వాటి ఆనవాళ్లు ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మళ్లీ గుర్తు చేయబోతున్నారు. ఒకప్పుడు మనం చూసి, ఇప్పుడు దూరమైన ఆ మధురానుభూతుల్ని “ఇంటింటి రామాయణం” ప్రియ ప్రేక్షకులకు పంచబోతోంది. సీతమ్మ తల్లి లాంటి కోడలు ఇంటిని నడిపిస్తే అది ఎంత అందంగా ఉంటుందో ఈ ఇంటిని చూసి నేర్చుకోవచ్చు.
ఒక ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఎంత బావుంటుందో, వాళ్ళ చెప్పే నాలుగు మంచి మాటలు కుటుంబాన్నిఎంత బాగా నడిపిస్తాయో, ఈ కుటుంబాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఒక చిన్న పిల్ల ఇంటికి వెలుగై ఎంత అందంగా ఉంటుందో చూసి సంబరపడవచ్చు. ఈ సీరియల్ స్టార్ మాలో జూన్ 10 నుంచి ప్రసారం కానుంది. రాత్త్రి 8.30 గంటలకు ప్రేక్షకులను అలరించనుంది.
రెండు కుటుంబాల మధ్య ఒక పెళ్లితో మొదలైన గొడవ.. ఇంకో పెళ్లితో పరిష్కారం కావాలని తపనపడే ఓ అవని ప్రయత్నం ఎటు దారితీసింది అనేది కథలో ఒక అంశం. ఆవని అంటే ఆ ఇంటి పెద్దకోడలు. పెద్దకోడలిగా ఆమె తీసుకున్న బాధ్యత విజయవంతం అవుతుందా లేదా అనేదానికి సమాధానం తెలియాలంటే “ఇంటింటి రామాయణం” చూడాల్సిందే.
Ramoji rao : అతిథి పాత్రలో నటించిన రామోజీరావు.. ఏ మూవీనో తెలుసా..?