Devi Sri Prasad : పెద్ద డైరెక్టర్ నన్ను పిలిచి మ్యూజిక్ కాపీ చేయమన్నాడు.. నేను నో చెప్పి అలా అనేసరికి..
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో ఎప్పుడో జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు.

Star Music Director Devi Sri Prasad Reveals Interesting Incident Regarding Copy Music
Devi Sri Prasad : ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది కాపీ కొడుతున్నారు. ట్యూన్స్ వేరే సినిమాలు, వేరే దేశాల సినిమాల నుంచి కూడా కాపీ చేస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో ఎప్పుడో జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు.
దేవిశ్రీ ప్రసాద్ మొదటి సినిమా దేవి. అదే 17 ఏళ్ళ వయసులో చేసాడు. ఆ సినిమా తర్వాత జరిగిన ఓ సంఘటనను పంచుకున్నాడు.
Also Read : Pawan Kalyan – Anushka Shetty : పవన్, అనుష్క కాంబోలో సినిమా మిస్ అయిందని తెలుసా? ఏ సినిమా అంటే..
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. దేవి సినిమా తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ నన్ను పిలిచి కొన్ని ఇంగ్లీష్ సీడీలు ఇచ్చి ఆ మ్యూజిక్ ని కాస్త అటు ఇటు మార్చి ఇవ్వు, నేను లిరిక్స్ రాయించుకుంటా అని ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. చేసేయి అని అంటున్నారు కానీ నేను చేస్తానా లేదా అని అడగట్లేదు. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఈ మాత్రం దానికి నేను ఎందుకు సర్, ఏ కీ బోర్డు ప్లేయర్ కి ఇచ్చిన నా కంటే ఫాస్ట్ గా చేసి ఇస్తాడు అని అన్నాను. దాంతో ఆయన కోపం తెచ్చుకొని ఏమనుకుంటున్నావ్ నువ్వు, నువ్వేమన్నా తోపా అది ఇది అని ఫైర్ అయ్యాడు. ఆయన అప్పుడు స్టార్ డైరెక్టర్ కావొచ్చు. కానీ పని ఇచ్చాక చేస్తావా లేదా అడగాలి కానీ చేసేయ్ అనకూడదు. ఇంకా ఆయన ఫైర్ అయ్యేసరికి.. నేను ఇక్కడ మ్యూజిక్ క్రియేట్ చేయడానికి వచ్చాను. నేను మ్యూజిక్ కాపీ చేయను, రీమిక్స్ చేయను అని చెప్పాను. ఇప్పటికి నేను కాపీ కొట్టను, రీమిక్స్ చేయను, అది నా సిద్ధాంతం అని తెలిపాడు.
Also See : Ananya nagalla : ఉఫ్.. చీరలో అనన్య నాగళ్ళ ఇంత హాట్ గా.. ఫొటోలు వైరల్..
అలాగే.. గద్దలకొండ గణేష్ సినిమా మొదట నేనే చేయాలి. కానీ అందులో ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ రీమిక్స్ ఉంది. అది దేవత సినిమాలో సాంగ్. దేవత సినిమా రైటర్ గా మా నాన్న మొదటి సినిమా. అయినా నేను రీమిక్స్ చేయను అని చెప్పి ఆ సినిమా వదులుకున్నా. నా కోసం ఆ పాట తీసేస్తా అన్నాడు హరీష్ శంకర్. నేనే వద్దన్నా. డబ్బులు దొంగతనం చేయడం కన్నా ఒకరు క్రియేషన్ చేసింది, క్రియేటివిటీ, ఐడియా దొంగతనం చేయడం పెద్ద క్రైమ్ అని అన్నాడు దేవిశ్రీ ప్రసాద్.