సైరా విడుదల ఆపండి : హైకోర్టులో ఉయ్యాలవాడ వారసుల పిటిషన్

తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

  • Published By: sekhar ,Published On : September 23, 2019 / 11:05 AM IST
సైరా విడుదల ఆపండి : హైకోర్టులో ఉయ్యాలవాడ వారసుల పిటిషన్

Updated On : May 28, 2020 / 3:47 PM IST

తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ ఉయ్యాలవాడ వారసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్‌గా జరిగింది.

అయితే గతకొద్ది రోజులుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు.. చిరంజీవి, రామ్ చరణ్ తమను వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సైరా విడుదలను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Read Also : సైరా – సెన్సార్ పూర్తి..

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారని, తమకు చిరంజీవి, రామ్ చరణ్ తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. మాట తప్పారని, న్యాయం కోసం పోరాటం చేస్తే తమపైనే అక్రమ కేసులు పెడుతున్నారని.. తమకు న్యాయం జరిగే వరకు సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చెయ్యొద్దంటూ ఉయ్యాలవాడ వారసులు పిటిషన్‌లో  పేర్కొన్నారు. సెప్టెంబర్ 24న (రేపు) పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ వివాదంపై చిరంజీవి, రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.