Sudheer Rashmi: సుధీర్-రష్మి జోడీ అదిరింది.
బుల్లితెర సెన్సేషన్ జోడీ సుధీర్-రష్మి మరోసారి తెరపై సందడి చేసింది. ఉగాది సందర్బంగా తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన జాతిరత్నాలు కార్యక్రమంలో సుధీర్-రష్మీ.. సందడి చేశారు.

Sudheer Rashmi
Sudheer Rashmi: బుల్లితెర సెన్సేషన్ జోడీ సుధీర్-రష్మి మరోసారి తెరపై సందడి చేసింది. ఉగాది సందర్బంగా తెలుగు టీవీ ఛానెల్ నిర్వహించిన జాతిరత్నాలు కార్యక్రమంలో సుధీర్-రష్మీ.. సందడి చేశారు. ‘ఉప్పెన’ చిత్రంలోని ‘జల జల జలపాతం నువ్వూ’ అనే పాటకు సందడి చేసి అలరించారు.
వీరిద్దరి పర్‌ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాక.. మాంచి కాంప్లిమెంట్లు కూడా కొట్టేసింది. వీరి పెర్ఫామెన్స్ సినిమాలో హీరోహీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.. రష్మీ తన నటనతో కుర్రకారుకు మత్తెక్కించింది. సుధీర్ కూడా తనదైన మార్క్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వీరి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.
వీరి ప్రదర్శనను ప్రేక్షకులు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయారు. ఈ పాట యూట్యూబ్ లో సంచలన క్రియేట్ చెయ్యడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.