Sudigali Sudheer : ఇప్పటికి హార్ట్‌లో పెయిన్ అంటూ.. పెంపుడు కుక్క మరణం గుర్తుచేసుకొని సుధీర్ ఎమోషనల్..
Sudigali Sudheer
Sudigali Sudheer
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క టీవీ షోలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. ప్రస్తుతం సుధీర్ ఆట అనే డ్యాన్స్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. తాజాగా ఈ షోలో ఒక డ్యాన్సర్ కుక్కపిల్ల లాగా పెర్ఫార్మ్ చేస్తూ డ్యాన్స్ చేసింది. ఇది చూసి సుధీర్ తన పెంపుడు కుక్క మరణం గుర్తుచేసుకొని బాధపడ్డాడు.
Also Read : Rashmika Mandanna : రష్మిక మందన్న బర్త్ డే స్పెషల్.. చిన్నప్పటి క్యూట్ ఫొటోస్ చూశారా..?
సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ఒక ఫ్యాన్ కొన్నేళ్ల క్రితం మా ఇంటి ముందు ఒక బాక్స్ లో చిన్న కుక్క పిల్లని పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు పెట్టారో తెలిసింది. చాలా క్యూట్ గా ఉండేది. మనం అలిగితే అదే మన మీదకు వచ్చేది. అల్లరి పనులు చేసి వేరే వాళ్ళను చూపించేది. ఒక మూడేళ్ళ తర్వాత మా ఆస్కార్ చనిపోయింది. తనకు రేరెస్ట్ జ్వరం వచ్చింది. పదకొండు రోజులు చాలా బాధపడి తన జ్వరం తాలూకు లక్షణాలు చూపించింది. దాంతో డాక్టర్స్ కి చుపించాము.
రష్మీకి కూడా కాల్ చేసి ఒక స్పెషల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ చేస్తూ రెండు రోజుల తర్వాత ఆస్కార్ చనిపోయింది అని డాక్టర్ చెప్పారు. ఆ రాత్రి అంతా ఆస్కార్ బాడీ ని మా ఇంట్లోనే పెట్టి అది ఇష్టం ఉన్నవాళ్ళందర్నీ పిలిచాను. మా తమ్ముడు అయితే దాని పక్కనే పడుకున్నాడు. ఇప్పటికి హార్ట్ లో తెలియని పెయిన్. ఆ తర్వాత మళ్ళీ ఇంకో డాగ్ పెంచుకోవాలన్నా భయం వచ్చేసింది. ఇప్పటికి మా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆస్కార్ గాడి ఫోటో ఉంటుంది అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
Also See : Dacoit Trailer Launch Event : అడివి శేష్ డెకాయిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
