The Archies : షారుఖ్ ఖాన్ కూతురి ఫస్ట్ సినిమా.. ‘ది ఆర్చీస్’ టీజర్ రిలీజ్.. సుహానాతో పాటు ఖుషి కపూర్ కూడా..

ది ఆర్చీస్ లో షారుఖ్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ తో పాటు పలువురు కొత్తవాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తోంది జోయా అక్తర్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

The Archies : షారుఖ్ ఖాన్ కూతురి ఫస్ట్ సినిమా.. ‘ది ఆర్చీస్’ టీజర్ రిలీజ్.. సుహానాతో పాటు ఖుషి కపూర్ కూడా..

Suhana Khan first Movie The Archies Teaser Released coming soon in Netflix

Updated On : June 19, 2023 / 11:39 AM IST

Suhana Khan :  షారుఖ్ ఖాన్(Shahrukh Khan) కూతురిగా సుహానా ఖాన్ ఇప్పటికే అందరికి పరిచయం. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంది. ఇటీవలే ఓ బ్యూటీ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎంపికైంది. సుహానా నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే స్టార్‌డంతో దూసుకెళ్లిపోతుంది. ఇక సుహానా ఖాన్ మొదటి సినిమా త్వరలోనే రానుంది. బాలీవుడ్ డైరెక్టర్ జోయా అక్తర్(Zoya Akhtar) ‘ది ఆర్చీస్'(The Archies) అనే ఓ సినిమాను తీస్తున్నారు.

ది ఆర్చీస్ లో షారుఖ్ కూతురు సుహానా, జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ తో పాటు పలువురు కొత్తవాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తోంది జోయా అక్తర్. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ టీజర్ చూశాక ఇది 1964లో జరిగే కథ అని, కాలేజీ లెవెల్ లో ఫ్రెండ్స్ మధ్య జరిగే కథ అని తెలుస్తుంది. లవ్ అండ్ కామెడీ డ్రామాగా ది ఆర్చీస్ ఉండబోతుంది. టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

Squid Game 2 : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ గేమ్ సిరీస్ స్క్విడ్ గేమ్.. సీజన్ 2 త్వరలో.. గ్లింప్స్ రిలీజ్..

సుహానా, ఖుషి కపూర్ కి ఇదే డెబ్యూట్ సినిమా కావడంతో షారుఖ్, జాన్వీ అభిమానులు, బాలీవుడ్ కూడా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇక ఈ టీజర్ ని షారుఖ్ ఖాన్ షేర్ చేస్తూ.. ఫాదర్స్ డే రోజు నా బేబీకి బెస్ట్ విషెస్ అండ్ ఈ సినిమాలో నటించే అందరి బేబీస్ కి కూడా అని ట్వీట్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కానుంది.