Writer Padmabhushan : రైటర్ పద్మభూషణ్ కలెక్షన్స్.. పెద్ద హిట్ కొడుతున్న మరో చిన్న సినిమా..
చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి...............

Suhas Writer Padmabhushan movie collections gets profit zone in less time
Writer Padmabhushan : షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోలతో మొదలుపెట్టి పేరు సంపాదించుకొని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగి అనంతరం కలర్ ఫోటో సినిమాతో హీరో అయ్యాడు సుహాస్. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. ఈ సినిమా అనంతరం సుహాస్ కి భారీగా ఆఫర్స్ వచ్చాయి. ఇక సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 3న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేయగా రోహిణి, ఆశిష్ విద్యార్ధి సుహాస్ అమ్మానాన్నలుగా చేసి మెప్పించారు.
రిలీజయిన మొదటి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. కామెడీ, ఎమోషనల్, అమ్మ సెంటిమెంట్ ఉండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. దీంతో చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు పెద్ద హిట్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాకి పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.
Varisu Collections : 300 కోట్లు కొల్లగొట్టిన వారసుడు.. ప్రాఫిట్స్ వచ్చినట్టా?? లేనట్టా?
చాలా తక్కువ క్యాస్ట్, తక్కువ లొకేషన్స్, తక్కువ టైంలో, ఒక 10 మంది తప్పితే మిగిలిన వాళ్లంతా చిన్న చిన్న ఆర్టిస్టులతోనే ఈ సినిమా తెరకెక్కించడంతో కేవలం 2-3 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ సినిమా మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మొదటి రోజుతో పాటు వీకెండ్ శని, ఆదివారాలు కలుపుకొని మూడు రోజుల్లో దాదాపు 5.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సోమవారం కూడా ఇంకో కోటి రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం. ఇక అమెరికాలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. అమెరికాలో ఇప్పటికే 250K డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇంకా థియేటర్స్ లో మంచి రన్ నడుస్తుండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాని ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పటికే ప్రాఫిట్స్ లో నడుస్తుండగా సుహాస్ హీరోగా ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టేసి మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
The Love keeps pouring in for #WriterPadmabhushan at the Box Office ❤️
5.2 CRORES GBOC WORLDWIDE in 3⃣ days ?❤️
Twaraga meeru kuda chuseyandi!!
– https://t.co/F7WzFJ2Dyt@ActorSuhas @prasanthshanmuk @anuragmayreddy @SharathWhat @LahariFilm pic.twitter.com/jVGqzHM1W8— Chai Bisket Films (@ChaiBisketFilms) February 6, 2023