Suhas: రైటర్ పద్మభూషణ్ ట్రైలర్.. సుహాస్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ ఖాయం!
టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుహాస్, ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇక ఆ సినిమా జాతీయ అవార్డును సైతం అందుకోవడంతో సుహాస్ అందరి ఫేవరెట్ యాక్టర్‌గా మారాడు. ఇటీవల హిట్-2 మూవీలో విలన్ పాత్రలోనూ నటించి మెప్పించాడు సుహాస్. కాగా, తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

Suhas Writer Padmabhushan Trailer Very Impressive
Suhas: టాలీవుడ్‌లో ట్యాలెంటెడ్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుహాస్, ‘కలర్ ఫోటో’ మూవీతో హీరోగా మారాడు. ఇక ఆ సినిమా జాతీయ అవార్డును సైతం అందుకోవడంతో సుహాస్ అందరి ఫేవరెట్ యాక్టర్‌గా మారాడు. ఇటీవల హిట్-2 మూవీలో విలన్ పాత్రలోనూ నటించి మెప్పించాడు సుహాస్. కాగా, తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
Suhas : వైల్డ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న నటుడు సుహాస్.. ఫోటో గ్యాలెరీ!
రైటర్ పద్మభూషణ్ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఓ ఫీల్‌గుడ్ మూవీలో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక ఈ ట్రైలర్‌లో సుహాస్ మరోసారి తనలోని నటుడిని ప్రేక్షకులను చూపిస్తున్నాడు. రైటర్ కావాలని కలలు కనే వ్యక్తిగా సుహాస్ ఈ సినిమాలో నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఆశిష్ విద్యార్థి, రోహిణి తల్లిదండ్రుల పాత్రల్లో తమదైన పర్ఫార్మెన్స్‌తో ఈ ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చారు.
ఈ సినిమాలో శిల్పారాజ్ హీరోయిన్‌గా నటిస్తోండగా శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్‌లు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాతో సుహాస్ మరో సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.