Sujeeth : ఏం చేశావ్ సుజీత్ బ్రో మా పవన్ కళ్యాణ్ ని.. ఇదే ఫస్ట్ టైం.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..
OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన అభిమానులు, ఈవెంట్ చూసిన ప్రేక్షకులు, సినిమా లవర్స్ అంతా ఆశ్చర్యపోయారు.(Sujeeth)

Sujeeth
Sujeeth : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. తాజాగా శనివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ కి వెళ్లిన అభిమానులు, ఈవెంట్ చూసిన ప్రేక్షకులు, సినిమా లవర్స్ అంతా ఆశ్చర్యపోయారు.(Sujeeth)
పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ సినిమా ఈవెంట్ కి ఆ సినిమా కాస్ట్యూమ్ లో రావడంతోనే అందరూ షాక్ అయ్యారు. ఇదే ఫుల్ హ్యాపీ అనుకుంటే OG సినిమాలో వాడిన కటానా తీసుకొని దాంతో విన్యాసాలు చేసారు. అంతే కాకుండా ఆ స్టేజిపై సినిమాలో ఉన్న జపనీస్ డైలాగ్స్ చెప్పారు. ఫ్యాన్స్ ని ఉర్రూతలాడించేలా మాట్లాడారు. స్టైలిష్ గా కళ్ళజోడు పెట్టుకొచ్చారు. స్టేజిపై శివమణి డ్రమ్స్ బీట్ కి ఊగిపోయారు.
Also See : OG Pre Release Event Photos : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
ఇవన్నీ చూసి అసలు మేము చూస్తున్నది మా పవన్ కళ్యాణ్ నేనా అనే సందేహం కూడా వచ్చింది. ఎప్పుడూ ఇంట్రోవర్ట్ గా ఉండే పవన్, స్టేజిపై పద్దతిగా ఉండే పవన్, రాజకీయాల్లోకి వచ్చాక స్టేజిపై సింపుల్ గా మాట్లాడేసి వెళ్ళిపోతున్న పవన్ ఇవాళ అన్నిటికి వ్యతిరేకంగా అందరిలో ఫుల్ జోష్ నింపారు.
అయితే దీనంతటికి కారణం దర్శకుడు సుజీత్. సుజీత్ పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ అని తెలిసిందే. పవన్ స్టేజిపై మాట్లాడుతూ.. సుజీత్ వల్లే ఈ ఈవెంట్ కి ఇలా సినిమా కాస్ట్యూమ్ లో వచ్చాను. సుజీత్ వల్లే నేను షూటింగ్ సమయంలో డిప్యూటీ సీఎం అనికూడా మర్చిపోయి ఎంజాయ్ చేశాను. సుజీత్ నాకు పెద్ద అభిమాని అని తెలుసు అంటూ సుజీత్ గురించి పొగిడారు. అంతే కాకుండా స్టేజిపై ఏం మాట్లాడాలి, ఇంకేమైనా చెప్పాలా అని సుజీత్ ని అడగడంతో సుజీత్ పవన్ ని ఏ రేంజ్ లో మార్చేసాడో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇటీవల డబ్బింగ్ కి కూడా పవన్ OG హుడీ వేసుకొచ్చారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయినా సంగతి తెలిసిందే. సుజీత్ అలా వేయించాడు అని తెలియడంతో ఫ్యాన్స్ సుజీత్ ని మరింత అభినందిస్తున్నారు.
pawan Kalyan
పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో పిచ్చ హ్యాపీగా ఉన్నారు. దీంతో సుజీత్ ని మా పవన్ కళ్యాణ్ ని ఏం చేసావ్ బ్రో ఇలా మారిపోయారు, నీ చిప్ తీసి పవన్ కి ఎక్కించావా? అసలు ఇది మా పవన్ కళ్యాణేనా? నిజమైన ఫ్యాన్ అనిపించుకున్నావు, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టావు సినిమా రిలీజ్ ముందే అంటూ సోషల్ మీడియాలో సుజీత్ ని పొగుడుతూ పోస్టులు, సరదా మీమ్స్ చేస్తున్నారు. బయట ఈవెంట్లోనే ఈ రేంజ్ లో ఉన్నారంటే ఇక సినిమాలో పవన్ ని ఏ రేంజ్ లో సుజీత్ చూపించాడా అని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ సింపుల్ గా ఉండే పవన్ కళ్యాణ్ ఇలా ఫుల్ ఎక్స్ట్రావర్ట్ గా రెచ్చిపోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Na momentttt ❤️ pic.twitter.com/cIiEGimTTH
— Sujeeth (@Sujeethsign) September 21, 2025