Sujeeth
Sujeeth : పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అసలు ప్రమోషన్స్ లేకుండానే సినిమాపై కావాల్సినంత హైప్ తెచ్చేసారు. ఇక డైరెక్టర్ సుజీత్ ని అయితే ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుంటున్నారు. సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ కావడం గమనార్హం. తాజాగా సుజీత్ ఓ వెబ్ సైట్ గురించి చెప్పి OG స్పెషల్ కంటెంట్ ఇస్తాను అని చెప్పడంతో ఆ వీడియో, వెబ్ సైట్ వైరల్ గా మారింది.(Sujeeth)
సుజీత్ మాట్లాడుతూ.. OG నుంచి ఓ స్పెషల్ కంటెంట్ ఇస్తాను. పది లక్షల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ ద్వారానే ఆ కంటెంట్ రిలీజ్ అవుతుంది. అందుకు www.oncemore.io వెబ్ సైట్ ని చూడండి అని తెలిపాడు. ఇప్పటికే ఆ వెబ్ సైట్ ని నాలుగు లక్షల మంది వరకు ఓపెన్ చేసారు.
Also Read : OG Premieres: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఓజీ ప్రీమియర్ షో టైమింగ్స్ లో మార్పులు
ఈ సైట్ ఓపెన్ చేస్తే.. కార్టూన్ లతో ఓ కథతో మొదలైంది. మొదట గంభీర(పవన్ కళ్యాణ్) జపాన్ గురువుని నేనెవరు, నా గతం ఏంటని అడుగుతాడు. ఆ తర్వాత మూడు లెవెల్స్ గేమ్స్ వస్తాయి. ఆ గేమ్స్ ఆడిన తర్వాత ఒక స్పిన్ గేమ్ వస్తుంది. ఆ స్పిన్ గేమ్ లో అదృష్టం ఉంటే మనకు గిఫ్ట్ లేదా OG టికెట్ వస్తాయి. ఆ తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అనంతరం మన పేరుతో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఒక కార్డు చూపిస్తారు. అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివర్లో రక్తంతో రాయబడిన నీ గతం మా సమురాయ్ ల భవిష్యత్తు గంభీర అన్నట్టు ఓ డైలాగ్ వస్తుంది. చివర్లో సుభాష్ చంద్రబోస్ కూడా రావడం గమనార్హం.
ఇక సుజీత్ యుద్ధం అనుకున్న కంటెంట్ అనేది ఒక ఫోటో అని తెలుస్తుంది. పది లక్షల మంది సైట్ ఓపెన్ చేసి ఆ గేమ్స్ ఆడాక ఆ స్పెషల్ ఫోటో వస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సైట్ తో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర పాత్రకు గతం ఉందని, గతంలో జపాన్ యోధులలో ఒకడని తెలుస్తుంది. దీంతో OG సినిమాకు ప్రీక్వెల్ ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ గేమ్ తో సినిమాపై మరింత హైప్ పెంచారు. చివర్లో సుభాష్ చంద్రబోస్ ని చూపించడంతో సినిమాలో ఇంకేం కొత్తగా చూపిస్తారో అని ఎదురుచూస్తున్నారు.
My Chief = Power Star
My Chief Guests = His FansThe final OG content will be unlocked by my CHIEF GUESTS! https://t.co/AALKjWTClb#fanstorm #OG #TheyCallHimOG@oncemore_io pic.twitter.com/7U2zpGS531
— Sujeeth (@Sujeethsign) September 22, 2025
Also Read : OG Collections : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG ఊచకోత.. రిలీజ్ కి ముందే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్..