OG Collections : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG ఊచకోత.. రిలీజ్ కి ముందే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్..

పవన్ కళ్యాణ్ OG సినిమా కూడా అమెరికాలో కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. (OG Collections)

OG Collections : అమెరికాలో పవన్ కళ్యాణ్ OG ఊచకోత.. రిలీజ్ కి ముందే కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్..

OG Collections

Updated On : September 22, 2025 / 12:36 PM IST

OG Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ OG సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అమెరికాలో అయితే రిలీజ్ కి ముందే OG సినిమా రికార్డులు బద్దలుకొడుతుంది.(OG Collections)

అమెరికాలో తెలుగు సినిమాలకు భారీ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసిందంటేనే పెద్ద హిట్. ఇక స్టార్ హీరోల సినిమాలు అయితే ఇంకా ఎక్కువ వసూలు చేస్తాయి. ఇప్పుడు OG సినిమా కూడా అమెరికాలో కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Also Read : Kalyan Dasari : OG ట్రైలర్ రిలీజ్ చేయండ్రా అంటే.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న నిర్మాత..

రిలీజ్ కి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే ఏకంగా నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 16 కోట్లకు పైగా గ్రాస్ రిలీజ్ కి ముందే అమెరికా నుంచే వచ్చేసింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ఓపెన్ చేస్తే బుక్ చేసుకోడానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ హైప్ తో OG సినిమా మొదటి రోజు ఏకంగా 100 కోట్ల గ్రాస్ ఈజీగా వసూలు చేస్తుందని అంటున్నారు.

Also See : Pawan Kalyan : కటానాతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోజులు.. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ ఫొటోలు..