Kalyan Dasari : OG ట్రైలర్ రిలీజ్ చేయండ్రా అంటే.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న నిర్మాత..

తాజాగా OG సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ దాసరి తాను హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. (Kalyan Dasari)

Kalyan Dasari : OG ట్రైలర్ రిలీజ్ చేయండ్రా అంటే.. హీరోగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న నిర్మాత..

Updated On : September 22, 2025 / 11:55 AM IST

Kalyan Dasari : పవన్ కళ్యాణ్ OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా ట్రైలర్ ని వాయిదా వేస్తూనే ఉన్నారు. ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. మూడు రోజుల్లో సినిమా పెట్టుకొని ట్రైలర్ రిలీజ్ చేయట్లేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు.(Kalyan Dasari)

అయితే తాజాగా OG సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ దాసరి తాను హీరోగా నటిస్తున్న సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. DVV దానయ్య తనయుడు, నిర్మాత కళ్యాణ్ దాసరి హీరోగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో గతంలో అధీరా అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ విలన్ ని కూడా పరిచయం చేసారు.

Also See : Pawan Kalyan : కటానాతో పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోజులు.. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పెషల్ ఫొటోలు..

కళ్యాణ్ దాసరి సూపర్ హీరోగా, SJ సూర్య నెగిటివ్ రోల్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా RKD స్టూడియోస్ నిర్మాణంలో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో అధీరా సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

OG ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే నిర్మాత తాను హీరోగా చేస్తున్న సినిమా అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ప్రశాంత్ వర్మ సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించొచ్చు.

Kalyan Dasari SJ Suryah Prasanth Varma Adhira Movie First Look Released

Also See : OG Pre Release Event : OG ప్రీ రిలీజ్ ఈవెంట్.. వర్షంలో కూడా గ్రాండ్ సక్సెస్.. ఫొటోలు..