OG Premieres: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఓజీ ప్రీమియర్ షో టైమింగ్స్ లో మార్పులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్(OG Premieres) మూవీ ఓజీ(ఓజాస్ గంభీరా). స్టైలీష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.

OG Premieres: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలర్ట్.. ఓజీ ప్రీమియర్ షో టైమింగ్స్ లో మార్పులు

Changes in OG movie premiere show timings in AP

Updated On : September 22, 2025 / 9:12 PM IST

OG Premieres: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీరా). స్టైలీష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేయగా(OG Premieres).. తాజాగా విడుదలైన ఓజీ ట్రైలర్ ఆ అంచనాలను డబుల్ చేసింది. పవన్ కళ్యాణ్ స్వాగ్, స్టైలీష్ యాక్టింగ్, సుజీత్ టేకింగ్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆడియన్స్, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమాను చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చింది.

OG: ఓజీ సెన్సార్ కంప్లీట్.. పర్ఫెక్ట్ రన్ టైం సెట్ చేశారు.. ఈసారి డెత్ కోట కన్ఫర్మ్!

ఈ పర్మిషన్ ప్రకారం సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1కి స్పెషల్ షోస్ వేసుకోవడానికి అనుమతులు ఇచ్చింది. అయితే, తాజాగా ఈ సమయాల్లో మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 25 అర్ధరాత్రి 1 నుంచి సెప్టెంబర్ 24 రాత్రి 10 గంటలకు ఆ సమయాన్ని మార్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది. దీంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో సైతం ఓజీ స్పెషల్ షోస్ కి అనుమతి లభించింది. సెప్టెంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి ఈ షోస్ మొదలుకానున్నాయి. మరి భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఓజీ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.