అడ్వాన్సే అన్ని కోట్లంటే.. అసలు ఇంకెంతో..

  • Published By: sekhar ,Published On : September 29, 2020 / 08:40 PM IST
అడ్వాన్సే అన్ని కోట్లంటే.. అసలు ఇంకెంతో..

Updated On : September 29, 2020 / 9:01 PM IST

Sukumar – Vijay Deverakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ మీద ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన కేదార్ భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు. అందులో భాగంగా తన మొదటి సినిమాను తన స్నేహితుడు, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్లతో పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నట్లు సోమవారం (సెప్టెంబర్ 28) తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.


అయితే క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు గాను సుకుమార్ భారీ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోనున్నారట. సుకుమార్ కు కేవలం అడ్వాన్స్‌గా రూ. 10 కోట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇపుడు ఈ విషయమే హాట్ టాపిక్‌గా మారయింది. 2022లో ఈ సినిమా మొదలు కానుంది.