Sukriti Veni : సుకుమార్ కూతురి ఫస్ట్ సినిమా.. థియేటర్స్ లో రిలీజ్ ఎప్పుడంటే..

న్యూ ఇయర్ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి నటించిన మొదటి సినిమా గాంధీ తాత చెట్టు రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Sukumar Daughter Sukriti Veni first Movie Gandhi Tatha Chettu Release Date Announced

Sukriti Veni : సుకుమార్ కూతురు సుకృతి వేణి ఓ పక్కన చదువుకుంటూనే సినీ పరిశ్రమలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే నటిగా ఓ సందేశాత్మక సినిమా చేసింది. గాంధీ తాత చెట్టు అనే సినిమా చేయగా ఈ సినిమాకి దేశవిదేశాల్లో అనేక అవార్డులు వచ్చాయి. సుకృతి వేణి ప్రధాన పాత్రలో ప‌ద్మావ‌తి మ‌ల్లాది ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ, రాగ్‌ మయూర్‌.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.

Also Read : Shiva Rajkumar : క్యాన్సర్ నుంచి కోలుకున్న స్టార్ హీరో.. భయపడ్డాను అంటూ ఎమోషనల్ వీడియో షేర్ చేసి..

ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్‌, గోపీ టాకీస్ సంస్థ‌లపై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్‌, శేష సింధు రావులు నిర్మాత‌లుగా తబిత సుకుమార్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ సినిమాలో నటనకు గాను ఉత్త‌మ‌బాల న‌టిగా సుకృతి వేణి దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు అందుకుంది. అంతేకాకుండా దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌, ఇండియ‌న్ ఫిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ తో పాటు అనేక ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా, సుకృతి అవార్డులు అందుకుంది.

ఇప్పటికే ఈ సినిమాకు గాను సుకృతిని అనేకమంది సెలబ్రిటీలు ప్రశంసించారు. అయితే ఈ సందేశాత్మక చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా సుకుమార్ కూతురు సుకృతి నటించిన మొదటి సినిమా గాంధీ తాత చెట్టు రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

మరి బోలెడన్ని అవార్డులు సాధించిన ఈ సినిమా మాములు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక సుకృతి వేణి ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క ఇలా నటన, దర్శకత్వం నేర్చుకుంటూనే ఫ్యాషన్ షోలలో కూడా పాల్గొంటుంది…

సినిమా అరిలిజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా డైరెక్టర్ పద్మావతి మల్లాది మాట్లాడుతూ.. ప్రపంచంలో ఇప్పుడు ద్వేషాలు, అసూయ.. ఇలా నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో బాగా నెగిటివిటి పెరిగింది. మనకు అహింస అనగానే మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి సమయంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనే కథతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సినిమా చూపించాలి అని అన్నారు.

Also Read : 7/G Brindavan Colony 2 : 7/G బృందావన కాలనీ సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..