sukumar gave Pushpa 2 update
Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘పుష్ప’. గతంలో వీరిద్దరూ కలిసి ప్రేమకథలతో అభిమానులు అలరించగా, పుష్ప సినిమాతో మాత్రం మాస్ జాతర చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నెల్లూరు యాసతో అందర్నీ ఆకట్టుకున్నాడు. అలాగే ఈ మూవీలో బన్నీ మానరిజమ్స్ మరియు డాన్స్ స్టెప్పులు వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాయి.
Allu Arjun : అతను లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు.. అల్లు అర్జున్!
ఇక ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుండగా మొదటి భాగం విడుదలయ్యి ఏడాది అవుతున్నా సెకండ్ పార్ట్ గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో.. అప్డేట్ కోసం అభిమానులు ఇటీవల ధర్నాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా నిన్న నిఖిల్ ’18 పేజిస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్, సుకుమార్ హాజరయ్యారు. ఈ సినిమాకు సుకుమార్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథని అందిస్తున్నాడు.
అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ అభిమానులకు ఫుష్ప 2 అప్డేట్ ఇచ్చాడు. “పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టాము. మొన్ననే అయిదు రోజులు చిత్రీకరణ కూడా చేసాము. ఈ సినిమా కోసం మీ హీరో ఎంతలా కష్టపడుతున్నాడు అంటే.. చిన్న చిన్న విషయాల్ని కూడా పట్టించుకోని, వాటికీ కూడా ఎక్స్‌ప్రెషన్స్ పలికిస్తూ ఎంతో ఇష్టంగా చేస్తున్నాడు. పుష్ప 2 అనేది ఆకాశాన్ని అందుకునేలా ఉంటది” అంటూ తెలియజేశాడు.