Sukumar – Pushpa 2 : పుష్ప 2 ఎందుకు లేట్..? సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

ఆగస్టులో రిలీజవ్వల్సిన పుష్ప 2 సినిమా ఏకంగా డిసెంబర్ కి వాయిదా పడింది.

Sukumar – Pushpa 2 : పుష్ప 2 ఎందుకు లేట్..? సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

Sukumar Planning on Pushpa 2 Movie Shooting and Releasing

Sukumar – Pushpa 2 : పుష్ప సినిమా ఇచ్చిన హైప్ తో అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టులో రిలీజవ్వల్సిన పుష్ప 2 సినిమా ఏకంగా డిసెంబర్ కి వాయిదా పడింది. ఎలా అయినా షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి సినిమాని ఆగస్ట్ లో రిలీజ్ చేద్దామనుకున్నా సుకుమార్ కి వర్కవుట్ కాలేదు. మరి ఈ సారి డిసెంబర్ లో అయినా సినిమా రిలీజ్ చేస్తారా? అసలు సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అని సందేహాలు వస్తున్నాయి.

ప్రతి చిన్న డీటెయిల్ ని చూస్తూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సుకుమార్ పుష్ప 2ని షూట్ చేస్తున్నారు. అందుకే ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిలే అయ్యి డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయిందని సమాచారం. ఇప్పటికే రరకరకాల కారణాలతో షూటింగ్ డిలే అవ్వడంతో కూడా పుష్ప 2 వాయిదా పడింది. మరోసారి వాయిదా పడకుండా ఇన్ టైమ్ లో షూట్ జరుపుకోవడానికి సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఆగస్ట్ లాస్ట్ కి షూటింగ్ అయ్యేలా స్ట్రిక్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేసేశారని తెలుస్తుంది.

Also Read : Ram Charan : ‘హనుమాన్’గా రామ్ చరణ్..? జై హనుమాన్ అప్డేట్.. హనుమాన్ నిర్మాత ఏం చెప్పారంటే?

ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2ని మూడు నెలల ముందు గానే షూటింగ్ కంప్లీట్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంది. ఎట్టి పరిస్తితుల్లో ఆగస్ట్ 31 నాటికి లాస్ట్ షూటింగ్ డేట్ అయ్యి తీరాలి అంటూ అల్టిమేటమ్ కూడా ఇచ్చారట సుకుమార్. ఈ కొత్త ప్యాకప్ డేట్ ని రీచ్ అవ్వడానికి ఇప్పటికే 3 యూనిట్లు సపరేట్ గా డే అండ్ నైట్ షూటింగ్ చేస్తున్నాయి. పుష్ప 2 విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఉన్న సుకుమార్ బెటర్మెంట్ కోసమే ఇంకా టైమ్ తీసుకున్నట్టు తెలుస్తోంది.

బన్నీ, సుకుమార్ కాంబోలో తెరకక్కుతున్న పుష్ప 2 బడ్జెట్ వాయిదాలు పడుతుండటంతో బడ్జెట్ బాగానే పెరిగిందట. పుష్ప 2 బడ్జెట్ దాదాపు 300 కోట్లు దాటిందని టాక్ నడుస్తుంది. అయితే సినిమాని అనుకున్నట్టు ఆగస్ట్ లో రిలీజ్ చేస్తే ఇంత ఖర్చయ్యేది కాదేమో. కానీ 4నెలలు వాయిదా పడటంతో మరింత బడ్జెట్ పెరిగిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 సినిమాని హై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

Also See : Kalki Movie Shooting Sets and Vehicles : ప్రభాస్ కల్కి షూటింగ్ సెట్ ఫోటోలు చూశారా? కల్కి సినిమాలో వాడిన వెహికల్స్ చూశారా?

పుష్ప 2 డిసెంబర్ 6న భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. మరి ఆ డేట్ కి రిలీజ్ అవ్వాలంటే ఆగస్ట్ ఎండ్ కి షూట్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్, కరెక్షన్స్.. ఇవన్నీ చేసుకుని నవంబర్ కి ఫస్ట్ కాపీ రెడీ చేసుకుంటేనే కానీ పాన్ ఇండియా ప్రమోషన్లకు వెళ్లే టైమ్ దొరుకుతుంది టీమ్ కి. మరి సుకుమార్ ప్లాన్ ఏ రేంజ్ లో వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో అంచనాలు భారీగానే ఉన్నాయి.