Sukumar : సాయినే కాదు ఈ సినిమా డైరెక్టర్ కూడా చచ్చిపోయే స్థితిలోంచి బయటకి వచ్చి ఈ సినిమా చేశాడు..

కార్తీక్ లైఫ్ చాలా చిన్నది. నాకు ముందు నుంచి తెలుసు. బతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఉండేవాడు. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు.

Sukumar speech in Virupaksha Pre Release Event

Sukumar :  మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తో రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష(Virupaksha) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. మొదట ఒక కథతో వచ్చాడు డైరెక్టర్ కార్తీక్. బాగా నెరేట్ చేశాడు కానీ కథ నాకు నచ్చలేదు. ఆ తరవాత ఈ కథతో వచ్చాడు. కార్తీక్ లైఫ్ చాలా చిన్నది. నాకు ముందు నుంచి తెలుసు. బతుకుతాడో లేదో తెలియని స్థితిలో ఉండేవాడు. అలాంటి స్థితి నుంచి బయటకు వచ్చి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. రోజూ స్టెరాయిడ్స్ మీద బతికేవాడు. వాళ్ళ అమ్మ తన కోసం హైదరాబాద్ కి వచ్చి తనతో ఉండేది. వాళ్ళ అమ్మ ఆశీస్సుల వల్లే బతికి సినిమా చేశాడు. సినిమాని బాగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయి కార్తీక్ కి మరిన్ని సినిమాలు వస్తాయి. జగడం సినిమా ఫ్లాప్ అయినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. కానీ ఈ సినిమా నిర్మాత ప్రసాద్ గారు నాకు నెలనెల డబ్బులు పంపిస్తూ సపోర్ట్ చేశారు. సంయుక్త తెలుగులో మాట్లాడదు అనుకున్నా. కానీ చాలా ఆబగా మాట్లాడింది. సంయుక్త ఈ క్యారెక్టర్ కి సరిపోదు అనుకున్నా, కానీ కార్తీక్ నమ్మాడు. పర్ఫార్మెన్స్ చూశాక చాలా బాగా చేసింది అనిపించింది. కాంతార సినిమాకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ దీనికి పనిచేశారు అని అన్నారు.

Sai Dharam Tej : నేనేమి తప్పు చేయలేదు.. యాక్సిడెంట్ అయింది.. తర్వాత కోలుకున్నాక మాటలు రాక ఏడ్చేశా..

ఇక సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. సాయి తేజ్ నిమొదటిసారి దిల్ రాజు గారి అమ్మాయి పెళ్లి కలిసాను. బాగా నవ్వుతూ చలాకీగా ఉండేవాడు. సెటైర్స్, జోక్స్ వేస్తూ అందర్నీ నవ్వించేవాడు. రైటర్స్ కూడా సరిపోరు సాయి వేసే జోక్స్ కి. అలంటి సాయిని విరూపాక్ష సినిమా షూటింగ్ కు వెళ్తే మొదట్లో ఒక్కో మాట కూడబలుక్కొని మాట్లాడేవాడు. చాలా భయమేసింది సాయిని అలా చూసి. అలాంటి స్థాయి నుంచి కష్టపడి బయటకి వచ్చి ఈ సినిమా చేశాడు. ఒక పెద్ద ఇన్సిడెంట్ తర్వాత బయటకు వచ్చి చేసిన ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.