Sai Dharam Tej : నేనేమి తప్పు చేయలేదు.. యాక్సిడెంట్ అయింది.. తర్వాత కోలుకున్నాక మాటలు రాక ఏడ్చేశా..

బైక్స్ నాకు చాలా ఇష్టం. నేనేమి తప్పు చేయలేదు. జారి పడ్డాను, యాక్సిడెంట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అమ్మ, తమ్ముడు ఉన్నారు. మాట్లాడలేకపోయాను, ఏడుపొచ్చేసింది.

Sai Dharam Tej : నేనేమి తప్పు చేయలేదు.. యాక్సిడెంట్ అయింది.. తర్వాత కోలుకున్నాక మాటలు రాక ఏడ్చేశా..

Sai Dharam Tej speech in Virupaksha Pre Release Event

Updated On : April 17, 2023 / 7:29 AM IST

Sai Dharam Tej :  మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తో రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష(Virupaksha) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం అమ్మ, తమ్ముడి కోసమే చేశాను. బాగానే వెళ్తుంది సినిమా లైఫ్ అనుకున్నా కానీ ఆరు ఫ్లాప్స్ వచ్చాయి. జీవితం బాగా తెలిసొచ్చింది. చిత్రలహరితో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను. అత్తారింటికి దారేది సినిమా అప్పుడు షూటింగ్ కి వెళ్తే నిర్మాత ప్రసాద్ గారు పరిచయమయ్యారు. ఆయన అప్పట్నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్నారు. బైక్స్ నాకు చాలా ఇష్టం. నేనేమి తప్పు చేయలేదు. జారి పడ్డాను, యాక్సిడెంట్ అయింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అమ్మ, తమ్ముడు ఉన్నారు. మాట్లాడలేకపోయాను, ఏడుపొచ్చేసింది. లైఫ్ మీద భయపడ్డాను. కానీ బయటకి రావాలి, మళ్ళీ సినిమాలు చేయాలి, మీ ప్రేమను పొందాలి అనుకున్నాను. ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. మన అమ్మ, పేరెంట్స్, గురువులు బాధపడకూడదు మన వల్ల. లైఫ్ లో ఉన్న గోల్ కోసం కష్టపడాలి. దయచేసి హెల్మెట్ వాడండి. మీరు మా కార్ వెనకాల తిరిగితారు. అప్పుడు మిమ్మల్ని చూస్తే భయమేస్తుంది, ఏడుపొస్తుంది. మీకేమైనా అయితే మేము బాధపడతాం. ఎక్కడికెళ్లినా హెల్మెట్ ఉండాలి. ఆడవాళ్ళని భయపెట్టకండి, వాళ్ళ కోసం ఒక మంచి ప్రపంచం క్రియేట్ చేద్దాం. వాళ్ళు మన కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ప్రేమించే అమ్మాయి కాకుండా మిగిలిన వాళ్ళల్లో అమ్మని చూసుకోండి. అమ్మాయిలు మీరు అబ్బాయిలు తప్పులు చేస్తే క్షమించండి అని అన్నారు.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్. సుకుమార్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తాను విను అన్నారు. నేనేమో లవ్ స్టార్ అనుకున్నాను, కానీ హారర్ స్టోరీ పంపించారు. డైరెక్టర్ కార్తిక్ బాగా నెరేట్ చేశాడు. కథ చెప్పేటప్పుడే భయపడ్డాను. యాక్సిడెంట్ తర్వాత ఈజీగా టైడ్ అయిపోయేవాడ్ని. నిర్మాతలు బాగా సపోర్ట్ చేశారు, షూటింగ్ కి ఇబ్బంది కలిగినా ఏమన్లేదు. 1990 లలో జరిగే కథ ఇది. సెట్స్ ని చూసి కూడా భయం వేసింది. ఆర్ట్ డైరెక్టర్ అంత భయపెట్టాడు. డైలాగ్ చెప్పేటప్పుడు చాలా కష్టమైనా నా తోటి నటి నటులు ఇబ్బంది పడినా సపోర్ట్ చేశారు అని తెలిపారు.

Police Stories : మళ్ళీ పోలీస్ స్టోరీల వైపుకు మళ్ళిన సినిమాలు.. పోలీస్ కథలే కావాలంటున్న హీరోలు..

ఇక తన మామయ్యలు గురించి మాట్లాడుతూ.. కళ్యాణ్ మామయ్య, నాకు అన్ని ఇచ్చిన నా గురువు గారితో కలిసి నటించాను. సముద్రఖని దర్శకత్వంలో చేసిన సినిమా చాలా బాగుంటుంది. మీరంతా కాలర్ ఎత్తుకునే సినిమా అది. మా ముగ్గురు మామయ్యలు వల్లే ఇవాళ స్టేజి మీద ఉన్నాను. మీ అందరికి థ్యాంక్స్ అని అన్నారు.