Seetha Kalyana Vaibhogame : ‘సీతా కళ్యాణ వైభోగమే’ రిలీజ్ డేట్ అనౌన్స్.. మన విలువలు, సాంప్రదాయాలు చూపించే సినిమా..
తాజాగా 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Suman Tej Garima Chouhan Seetha Kalyana Vaibhogame Release Date Announced
Seetha Kalyana Vaibhogame : సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాచాల యుగంధర్ నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.
దర్శకుడు సతీష్ పరమవేద మాట్లాడుతూ.. నా ఫస్ట్ సినిమా ఊరికి ఉత్తరాన నిర్మించిన యుగంధర్ గారు ఈ సినిమాని కూడా నిర్మించడం ఆనందంగా ఉంది. రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మన విలువలు, సంప్రదాయాలను అందరికీ చూపించాలానే ఈ సినిమాను తీశాను. మర్చిపోతోన్న మన విలువల్ని అందరికీ గుర్తు చేసే ఈ సినిమా ఏప్రిల్ 26న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది అని తెలిపారు.
Also Read : Chiranjeevi : డూప్ లేకుండా 68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్.. ‘విశ్వంభర’ కోసం చిరు సాహసం..
ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రముఖ ఫ్యాషన్ సంస్థ నీరూస్ భాగస్వామి అయిందని హీరో సుమన్ తేజ్ తెలిపాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ లో కూడా కొత్త కొత్త డిజైన్ వేర్స్ వాడుతున్నారు. ఈ సినిమా ద్వారా గరీమ చౌహాన్ తెలుగులో పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో వందల మందితో ఫైట్స్ భారీ యాక్షన్ గా తీశామని, యాక్షన్, లవ్, కుటుంబ విలువలు అన్నీ ఈ సినిమాలో ఉంటాయని, నీరూస్ యాజమాన్యం తమకు సహకరించిందని నిర్మాత రాచాల యుగంధర్ తెలిపారు.
