Sumanth : తాతయ్య చనిపోయినప్పుడు బాధపడలేదు.. 19 ఏళ్లకే మా అమ్మ చనిపోయింది.. నేను అమెరికాలో.. సుమంత్ ఎమోషనల్..
సుమంత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తాత, తల్లి మరణం గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

Sumanth Gets Emotional While Remembering his Mother and Akkineni Nageswara Rao
Sumanth : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుమంత్ ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి మంచి మంచి హిట్స్ అందించిన సుమంత్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘అనగనగా’ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఆ సినిమా మంచి విజయం సాధించి అందరి ప్రశంసలు అందుకుంటుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన తాత, తల్లి మరణం గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
Also Read : Vishnupriya – Prithvi : పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ.. ఒకవేళ అతను చెప్తే..
సుమంత్ మాట్లాడుతూ.. మా తాతయ్య చనిపోయినప్పుడు నేను అస్సలు బాధపడలేదు. ఎందుకంటే ఆయన ఫుల్ జీవితం చూసేసారు. ఆయన చుట్టూ ఉండే అందరూ బాధపడినా నేను బాధపడలేదు. ఆయనకు క్యాన్సర్ వస్తే ఆయనే బాధపడలేదు. ఇంకా నేనెందుకు బాధపడాలి అనుకున్నా. కానీ నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. నాకు 19 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. అప్పుడు మా అమ్మకు కూడా ఏజ్ తక్కువే. మా అమ్మ చనిపోయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అక్కడ్నుంచి వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యాడు.