Sundeep Kishan : ఆ సినిమా నుంచి సందీప్ కిషన్ హీరోగా తప్పుకున్నాడా? తీసేసారా? సందీప్ ప్లేస్ లో హీరో ఎవరంటే..?

ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై నిర్మాత రాహుల్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

Sundeep Kishan Left From Vibe Movie Producer Rahul Yadav Nakka Gives Clarity

Sundeep Kishan : సందీప్ కిషన్ ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్స్ కొట్టాడు. త్వరలో మజాకా సినిమాతో రాబోతున్నాడు. మజాకా సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో వైబ్ అనే సినిమా ఒకటి. రాహుల్ యాదవ్ నక్క నిర్మాణంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ స్వరూప్ దర్శకత్వంలో వైబ్ సినిమాను ఇటీవల కొన్ని నెలల క్రితం ప్రకటించారు.

సందీప్ కిషన్ తో కొంత షూటింగ్ కూడా జరుపుకుంది ఈ సినిమా. సందీప్ కిషన్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై నిర్మాత రాహుల్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : NTR – Vijay Deverakonda : రౌడీ స్టార్ కోసం రానున్న మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ ఫోటో వైరల్..

ఓ ఇంటర్వ్యూలో రాహుల్ యాదవ్ దీనికి సమాధానమిస్తూ.. డేట్స్ ఇష్యూ వల్లే సందీప్ గారు తప్పుకున్నారు. నేను, డైరెక్టర్, సందీప్ కూర్చొని మాట్లాడుకున్నాకే ఆయన తప్పుకున్నారు. డిసెంబర్ లో త్రిసూర్ లో ఓ ఫెస్టివల్ జరుగుతుంది. షూటింగ్ ఈ సంవత్సరమే చేయాలి. మేము దాని కోసం చాలా ప్రిపరేషన్ చేసాము. లేదంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. సందీప్ కి డేట్స్ కుదరక, కొన్ని కమిట్మెంట్స్ వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇందులో ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పారు.

అయితే సందీప్ ప్లేస్ లో ఎవర్ని తీసుకున్నారో చెప్తూ.. డైరెక్టర్ స్వరూప్ ఓ రోజు బ్రహ్మ ఆనందం షూట్ కి వస్తే వైబ్ లో నెక్స్ట్ సందీప్ లేరు కదా ఎవరు అని అడిగితే ఒక వారం రోజుల తర్వాత రాజా గౌతమ్ బెటర్ అని చెప్పాడు. నేను వెంటనే వెళ్లి సెట్స్ లోనే రాజా గౌతమ్ తో మాట్లాడి ఓకే చేశాను. రాజా గౌతమ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు. ఆ సినిమా చూస్తే మీరే చెప్తారు అని అన్నారు.

Also Read : Saif Ali Khan : కత్తితో దాడి.. సర్జరీ.. ఇంత జరిగిన తర్వాత కూడా సెక్యూరిటీ వద్దంటున్న సైఫ్ అలీ ఖాన్.. పైగా ఈ దాడి గురించి ఏమన్నాడో తెలుసా?

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా బ్రహ్మానందం ముఖ్య పాత్రలో బ్రహ్మ ఆనందం అనే సినిమాని రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తండ్రీకొడుకులు అయిన బ్రహ్మానందం రాజా గౌతమ్ తాతమనవడుగా నటించడంతో మంచి అంచనాలే ఉన్నాయి.