NTR – Vijay Deverakonda : రౌడీ స్టార్ కోసం రానున్న మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ ఫోటో వైరల్..

రేపు ఫిబ్రవరి 12న VD12 సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

NTR – Vijay Deverakonda : రౌడీ స్టార్ కోసం రానున్న మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ ఫోటో వైరల్..

NTR Vijay Deverakonda Photo goes Viral NTR Comes for VD 12 Teaser Voice

Updated On : February 11, 2025 / 2:59 PM IST

NTR – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అయింది. ఫ్యామిలీ స్టార్ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత విజయ్ మూడు సాలిడ్ పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిల్లో నెక్స్ట్ రాబోతున్న VD12 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో VD12 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రేపు ఫిబ్రవరి 12న VD12 సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

Also Read : Saif Ali Khan : కత్తితో దాడి.. సర్జరీ.. ఇంత జరిగిన తర్వాత కూడా సెక్యూరిటీ వద్దంటున్న సైఫ్ అలీ ఖాన్.. పైగా ఈ దాడి గురించి ఏమన్నాడో తెలుసా?

ఈ టీజర్ ని తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ టీజర్ కి వాయిస్ ఇవ్వనున్నారు. తమిళ్ టీజర్ కు సూర్య, హిందీ టీజర్ కు రణబీర్ కపూర్ వాయిస్ ఇస్తుండగా తెలుగులో మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఇవ్వనున్నారు. తాజాగా ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటో ఒకటి మూవీ యూనిట్ షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

NTR Vijay Deverakonda Photo goes Viral NTR Comes for VD 12 Teaser Voice

ఎన్టీఆర్ – విజయ్ దేవరకొండ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ దేవర తర్వాత అసలు మీడియా ముందుకు రాలేదు. అప్పుడప్పుడు ఎయిర్ పోర్ట్ లుక్స్ తప్ప వేరే ఫొటోలేవీ బయటకు రాలేదు. తాజాగా డబ్బింగ్ చెప్పడానికి రాగా తీసిన ఫోటోలో లుక్ కొత్తగా ఉండటంతో ఎన్టీఆర్ ఫోటోని ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు.

NTR Vijay Deverakonda Photo goes Viral NTR Comes for VD 12 Teaser Voice

 

Also See : Parvati Nair Wedding : వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫోటోలు చూశారా..?

ఇక ఈ సినిమాని మార్చ్ 28న రిలీజ్ చేస్తారని ప్రకటించారు కానీ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత VD13, VD14 సినిమాలు కూడా భారీగా ఉండనున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో VD13 సినిమా రూరల్ యాక్షన్ డ్రామా కథతో రానుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో VD14 సినిమా పీరియాడిక్ యాక్షన్ గా రానుంది. దీని గురించి విజయ్ కూడా ట్వీట్ చేస్తూ.. నిన్నంతా ఈయనతోనే గడిపాను. లైఫ్ గురించి, టైం, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. నిన్నంతా డబ్బింగ్ థియటర్ లో ఎన్టీఆర్ అన్న నా లాగే ఎగ్జైట్ అయ్యారు. మా సినిమాలోకి మీ ప్రపంచాన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్యూ అంటూ పోస్ట్ చేసాడు.