OoruPeru Bhairavakona : సందీప్ కిషన్ ‘ఊరుపేరు భైరవకోన’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

ఓ ప్రేమకథతో పాటు, దెయ్యాలు, ఆత్మలు అంటూ కామెడీ థ్రిల్లింగ్ గా ఊరుపేరు భైరవకోన సినిమా ప్రేక్షకులని మెప్పించింది.

OoruPeru Bhairavakona Collections : VI ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా, వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), కావ్య థాపర్(Kavya Thapar) హీరోయిన్స్ గా తెరకెక్కిన ‘ఊరుపేరు భైరవకోన’ సినిమా ఫిబ్రవరి 16న థియేటర్స్ లో రిలీజయింది. సినిమా రిలీజ్ కి ముందే సినిమాలోని ఓ పాట బాగా వైరల్ అవ్వడం, ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత థ్రిల్లింగ్ అంశాలు ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా రిలీజ్ కి రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలు వేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత కూడా సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఓ ప్రేమకథతో పాటు, దెయ్యాలు, ఆత్మలు అంటూ కామెడీ థ్రిల్లింగ్ గా ఊరుపేరు భైరవకోన సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ఈ సినిమా మొదటి రోజు 6.03 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read : Chiranjeevi : అమెరికాలో మెగాస్టార్, వెంకిమామ.. ఒకే పెళ్ళిలో సందడి చేస్తూ..

ఊరుపేరు భైరవకోన సినిమాకు దాదాపు 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 11 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. మొదటి రోజే 6 కోట్ల గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 3 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఈ రెండు రోజులు వీకెండ్ లో ఊరుపేరు భైరవకోన సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ ఓ మంచి సినిమాతో వచ్చాడు. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయితే హిట్ కూడా కొట్టేసినట్టే.

ఇక ఈ రేంజ్ కలెక్షన్స్ చూసి సందీప్ కిషన్.. నా మీద ప్రయోగించబడిన అస్త్రాలన్నిటిని దాటించి ఇది మీరు నాకు అందించిన విజయం, నా ప్రాణం అడ్డేసైన సరే, నా కష్టంతో మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పటికి నిలబెట్టుకుంటాను అని పోస్ట్ చేసాడు.

ట్రెండింగ్ వార్తలు