Suneel : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్

ఇవాళ 'పుష్ప' సినిమా నుంచి సునీల్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ‘పుష్ప’ టీమ్‌ సునీల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని షేర్‌ చేసి ‘‘రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌’’ అని

Suneel : ‘మంగళం శ్రీను’గా భయపెడుతున్న సునీల్

Sunil

Updated On : November 7, 2021 / 11:28 AM IST

Suneel : ఒకప్పుడు తన కామెడీ టైమింగ్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించి స్టార్ కమెడియన్ గా ఎదిగాడు సునీల్. తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేసాడు. హీరోగా అంత సక్సెస్ అవ్వకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇప్పుడు వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చాలా సినిమాలు చేస్తున్నాడు సునీల్. గతంలో డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాల్లో విలన్ గా నటించి భయపెట్టాడు. తాజాగా మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ సారీ మరీ భయంకరంగా కనిపించబోతున్నాడు.

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ..

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమాలో సునీల్‌ ఓ విలన్ గా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల అవ్వనుంది. దాంతో ఇప్పట్నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఆర్టిస్టుల ఫస్ట్ లుక్స్, సాంగ్స్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ ‘పుష్ప’ సినిమా నుంచి సునీల్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ‘పుష్ప’ టీమ్‌ సునీల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని షేర్‌ చేసి ‘‘రాక్షసుడి పరిచయం.. మంగళం శ్రీనుగా సునీల్‌’’ అని పోస్ట్ చేశారు. ఇందులో సునీల్‌ అంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త లుక్ లో అతి క్రూరంగా కనిపిస్తున్నాడు. ఈ లుక్ చూసి భయపడటం పక్కా. సునీల్ ఇలా మారిపోయాడు ఏంటి అంటూనే పాత్ర కోసం ఇంతగా మార్చుకున్నాడు అని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలో సునీల్ మరోసారి తన నట విశ్వ రూపం చూపించబోతున్నాడని తెలుస్తుంది.