Sunil Narang Popcorn Rates: పాప్కార్న్ రేట్లు తగ్గించే ప్రసక్తి లేదు.. సునీల్ నారంగ్ వ్యాఖ్యలు వైరల్..
మల్టీప్లెక్స్ లో ఉండే స్నాక్స్ ధరలపై ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. (Sunil Narang)
Sunil Narang Comments On Popcorn Rates In Multiplex Theaters
Sunil Narang : సినిమా థియేటర్స్ కి జనాలు రాకపోవడానికి స్నాక్స్, పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కూడా ఒక కారణం అని అందరి అభిప్రాయం. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు ఆకాశాన్నంటుతాయి. బయట 20 రూపాయలకు దొరికే పాప్ కార్న్ మల్టీప్లెక్స్ కి వెళ్తే 200 పెట్టాల్సిందే. కూల్ డ్రింక్ కూడా మినిమమ్ 150 పెట్టాల్సిందే. 350, 400 రూపాయలకు కూడా పాక్ కార్న్ అమ్ముతున్నారు. అంతకు మించి కూడా ధరలు ఉన్నాయి.
మల్టీప్లెక్స్ లో ఉండే స్నాక్స్ ధరలపై ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. టాలీవుడ్ జనాలు, నిర్మాతలు కూడా ఆ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు. అయితే ఇది మల్టీప్లెక్స్ నిర్వాకుల చేతుల్లోనే ఉంది. తాజాగా ఏషియన్ మల్టీప్లెక్స్ ల అధినేత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత సునీల్ నారంగ్ థియేటర్స్ వివాదానికి సంబంధించి ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా మల్టీప్లెక్స్ లలో అధిక ధరలు ఉండే పాప్ కార్న్ గురించి ప్రస్తావన రాగా ఆయన స్పందించారు.
Also Read : Jayam Ravi : కోట్ల ఆస్తి.. అయినా నెలకు అంత భరణం కావాలంట.. జయం రవి భార్య సంచలనం..?
సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. మల్టీప్లెక్స్ లలో పాప్కార్న్ రేట్లు తగ్గించడం సాధ్యం కాదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో స్నాక్స్ రేట్లు తగ్గించడం కుదరొచ్చేమో కానీ మల్టీప్లెక్స్ లలో అది కుదరదు. ఆ రేట్లు తగ్గిస్తే మల్టీప్లెక్స్ లను మెయింటైన్ చేయలేము. మల్టీప్లెక్సులో తక్కువ రేటు పెట్టి ఇడ్లీ – వడ లాంటివి అమ్మితే ఎవరూ తినరు. మల్టీప్లెక్స్ లోకి రాగానే పాప్ కార్న్ వాసన రావాలి.
తెలుగు రాష్ట్రాల్లో పాప్కార్న్ ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ లో మాత్రం స్నాక్ రేట్లు తక్కువే ఉండాలి. ముంబైలో స్నాక్స్ రేట్లు ఎక్కువ ఉండడం వల్లే అక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. మన దగ్గర సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో స్నాక్స్ ధరలు ఇంకా అందుబాటులోనే ఉన్నాయి అని అన్నారు. పాప్ కార్న్ రేట్లు తగ్గించడం కుదరదు అని అంటున్న సునీల్ నారంగ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
