కాలేజ్ మెరిట్ లిస్ట్‌లో తన పేరు చూసి ఫన్నీ ట్వీట్ చేసిన సన్నీ..

  • Published By: sekhar ,Published On : August 28, 2020 / 07:09 PM IST
కాలేజ్ మెరిట్ లిస్ట్‌లో తన పేరు చూసి ఫన్నీ ట్వీట్ చేసిన సన్నీ..

Updated On : August 28, 2020 / 7:28 PM IST

Sunny Leone ‘tops’ Kolkata college’s merit list: ఎన్నికల టైమ్‌లో ఓటర్ కార్డు మీద.. పేరు ఎవరిదో ఉండి.. ఫొటో మాత్రం సెలబ్రిటీలవి ఉండటం ఆ మధ్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడొక కాలేజ్ ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో హాట్ భామ, బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు టాప్‌లో ఉండటంతో అంతా అవాక్కవుతున్నారు. అదేంటి సినిమాలు చేసుకునే సన్నిలియోన్ కాలేజ్‌లో ఎప్పుడు జాయిన్ అయిందా అని అంతా ముచ్చటించుకుంటున్నారు. ఈ విషయం సన్నీలియోన్ వరకు వెళ్లి.. ఆమె కూడా రియాక్ట్ అయ్యింది..

Kolkata college’s merit list

కోల్‌క‌తా‌లోని అషుతోష్‌ కాలేజీ ప్రకటించిన 12వ త‌ర‌గ‌తి బోర్డ్ ప‌రీక్ష‌ల మెరిట్‌ జాబితాలో (డిగ్రీ అడ్మిషన్​ లిస్ట్​లో) స‌న్నీలియోన్ పేరు టాప్ ప్లేస్‌లో ఉంది. అంతేకాదు ఆమె రోల్ నెంబర్, అప్లికేషన్ ఐడీ అన్ని చూపిస్తూ, ఆమెకు వచ్చిన మార్కుల జాబితాను కూడా ఈ లిస్ట్‌లో పొందుపరిచారు. విశేషం ఏమిటంటే 4 సబ్జెక్ట్స్‌లో కూడా నూటికి నూరు మార్కులు ఆమెకు వచ్చాయి. దీంతో అందరూ ఈ విషయంపై ట్రోలింగ్ మొదలెట్టారు.

ఆఖరికి సన్నీలియోన్ కూడా ఈ విషయంపై ట్వీట్ చేసింది. ‘‘కాలేజ్ నెక్స్ట్ సెమిస్టర్‌లో మీ అందరినీ కలుసుకుంటానని అనుకుంటున్నాను. మీరంతా నా క్లాస్‌లో ఉంటారని భావిస్తున్నాను..’’ అని జోక్ చేస్తూ సన్నీ ఫన్నీ ట్వీట్ చేసింది. దీంతో అలెర్ట్ అయిన కాలేజీ యాజమాన్యం.. ఇది కావాలని ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా చెబుతూ.. వెంటనే విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.