మమ్ముట్టితో సన్నీ-వైరల్ అవుతున్న పిక్

మమ్ముట్టి నటిస్తున్న మలయాళ సినిమా మదుర రాజాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్.

మమ్ముట్టితో సన్నీ-వైరల్ అవుతున్న పిక్

Updated On : September 17, 2021 / 3:51 PM IST

మమ్ముట్టి నటిస్తున్న మలయాళ సినిమా మదుర రాజాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్.

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, సన్నీలియోన్ కలిసి ఉన్న ఫోటో ఒకటి మహిళల ఆగ్రహానికి గురైయ్యింది. అసలు విషయం ఏంటంటే,  మమ్ముట్టి నటిస్తున్న మలయాళ సినిమా మదుర రాజాలో సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ చేస్తుంది. ఆ పాట షూటింగ్ అప్పుడు తీసిన ఒక ఫోటోని నటుడు అజు వర్గీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ పిక్‌లో మమ్ముట్టి పంచెకట్టులో ఉండగా, అతని పక్కనే సన్నీ కూర్చుని ఉంది. చుట్టూ మమ్ముట్టి అసిస్టెంట్స్‌గా నటిస్తున్న ఆర్టిస్టులున్నారు. ఫోటోలో తప్పేంలేదు కదా, ఇంకెందుకు రాద్దాంతం అనుకుంటున్నారా?

 

అజు వర్గీస్ ఈ పిక్‌కి, అక్క విత్ ఇక్క అనే హెడ్డింగ్ పెట్టి పోస్ట్ చేసాడు. అక్క, ఇక్క అంటే బ్రదర్, సిస్టర్ అని అర్థం. దీంతో మహిళలందరూ తీవ్రస్థాయిలో కామెంట్స్ చెయ్యడం స్టార్ట్ చేసారు. వారికి మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా యాడ్ అయ్యేసరికి, అజు వర్గీస్ తను పోస్ట్ చేసిన ఫోటోని డిలీట్ చేసేసాడు. 2010లో మమ్ముట్టి, పృథ్వీరాజ్ నటించిన సూపర్ హిట్ సినిమా పోక్కిరిరాజాకి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. వైశాఖ్ ఈ మూవీని డైరెక్ట్ చేసాడు.