కరోనా వైరస్ – భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. సెలబ్రిటీల సూచనలు..

కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 06:33 AM IST
కరోనా వైరస్ – భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి.. సెలబ్రిటీల సూచనలు..

Updated On : March 5, 2020 / 6:33 AM IST

కరోనా వైరస్- తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీల ట్వీట్స్..

గతకొద్ది రోజులుగా కరోనా వైరస్ (కోవిడ్ -19)  ప్రపంచాన్ని వణికిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా అనుమానితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది.

ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలామంది మాస్కులు ధరించి బయటకొస్తున్నారు. షూటింగు నిమిత్తం యూరప్ వెళ్లడానికి ముందు ఎయిర్ పోర్టులో ప్రభాస్ మాస్క్‌తో కనిపించాడు. ఉపాసన, మహేష్ బాబు వంటి పలువురు సెలబ్రిటీలు కరోనా గురించి ప్రజలు భయపడొద్దని సోషల్ మీడియా ద్వారా సందేశాలిచ్చారు.

రామ్ చరణ్ సతీమణి ఉపాసన, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనాకు సంబంధించి తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. ‘‘కరోనా గురించి ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి.. భయపడకండి.. జాగ్రత్తగా ఉండండి’’.. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.(క‌రోనాకే వార్నింగ్ ఇచ్చిన వర్మ)